Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

కొరకు నిబంధనలు మరియు షరతులు) నిబంధన, 2005 (2005 లో 2వ నిబంధన)
కు ఈ సవరణలను జారీ చేయడమైనది:--

ప్రధాన నిబంధన 2/2005

(సవరణ నిబంధన ను ప్రధాన నిబంధనలో పొందు పరచడమైనది)

1. సంగ్రహ నామము, ప్రారంభము, అన్వయము:

(ఏ) ఈ నిబంధనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఓపెన్ యాక్సెస్ కొరకు నియమాలు మరియు షరతులు) నిబంధన, 2005 అని పిలువవచ్చును.

(బి) ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటికీ వర్తించును.

(సి) ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అది ప్రచురించబడిన తేదీన అమలులోనికి వచ్చును.

(డి) భారత ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖ, భారత రాజపత్రము యొక్క 2వ అసాధారణ భాగములో జూన్ 8, 2005 తేదీన ప్రకటించిన విద్యుత్ (ఇబ్బందులను తొలగించుట) రెండవ ఉత్తరువు, 2005 తో పాటుగా ఈ నిబంధనను కలిపి చదువవలెను.

2. నిర్వచనములు:

ఈ నిబంధనలో సందర్భమును బట్టి వేరే అర్ధము ఉన్ననే తప్ప;--

(ఏ) “చట్టము” అనగా కేంద్ర విద్యుత్ చట్టము, 2003 (2003 లోని 36వ చట్టము) అని అర్ధము;

(బి) “దరఖాస్తుదారుడు" అనగా ఓపెన్ యాక్సెస్ కొరకు నోడల్ ఏజెన్సీ కి దరఖాస్తు చేయు వ్యక్తి అని అర్ధము. ఇందులో విద్యుత్ ఉత్పాదన చేయు ఎవరేని వ్యక్తి, అనుమతిదారుడు లేక ఈ నిబంధన క్రింద ఓపెన్ యాక్సెస్ కొరకు అర్హుడైన ఎవరేని వినియోగదారుడు చేరియుండును;

(సి) "అందుబాటులో ఉన్న సామర్ధ్యము” అనగా విద్యుత్తును ఒక పాయింటు నుండి మరొక పాయింటుకు తరలించుటకు గాను మెగా వాట్లలో (ఏం.డబ్ల్యు.) లేక కిలో వాట్లు (కె.డబ్ల్యు.) లో గాని ప్రసారణ లేక పంపిణీ నెట్ వర్కుకు ఉన్న సామర్ధ్యము అని అర్ధము;

(డి) “మండలి” అనగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అని అర్ధము;

40