Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

‘వద్దమ్మా, తప్పు. కుటుంబం లో బండారం వీధిలోకి లాగ రాదు, వెళ్ళు ఇంట్లోకి వెళ్ళు’ అనే తరహా. భార్య బయటకొచ్చి ఏడిస్తే కుటుంబం బండారం బయట పడుతుంది అనేది వాస్తవం. అలాగే భర్త భార్యను కొట్టడం అనేది ఇంకో నష్ట పూరితమైన అంశం. రెంటిలో – కుటుంబం బండారం బయట పడుతుంది అనే విషయాన్ని ఎన్నుకుని విషయంలో negativity ని దుర్భిణితో చూపించి అసలు ప్రధాన సమస్యను ఏదోలా తప్పు దారి పట్టించడం.

కేవలం ఈ Negativity ని మాత్రమే project చేయడం ఎందుకు జరుగుతుందంటే – ఆ గుంపు యొక్క ప్రయోజనాలు ఒకే కోణం వేపు మొగ్గినప్పుడు, అటు వేరే పార్శ్యానికి సంబంధించి వీళ్ళు ఎటువంటి ప్రయోజనం చూడనప్పుడు. ఏ మేధావి అయినా – ఒక విషయం లోని అంశాలు సామాజిక ప్రయోజనాలతో ఎక్కడ ఏకీభవిస్తాయో చూడ్డంలో ఫెయిల్ కావడం ఎక్కడో ఒక చోట సాధారణంగా జరుగుతుంది. కానీ పైన ఉదాహరించిన Negativity bias ను సూక్ష్మంగా చుస్తే తుద విశ్లేషణ లో – ఒకే centric point దగ్గరే మిగులుతుంది. బండారం బయట పడ్డం అనే విషయం. ప్రతిష్ట దెబ్బ తినడం అనే విషయాన్ని ప్రబలంగా ఎందుకు ముందు తీసుకొస్తున్నారు? ఈ మేధావులు ఏ centric point కు కవచంగా నిలువదల్చుకున్నారో అన్న విశ్లేషణ వ్యాసానికున్న పరిమితి వల్ల పాఠకుల అంతిమ వివేచనకు వదిలేస్తున్నా.

డాక్యుమెంటరీ తాలూకు కమర్షియల్ కోణాన్ని వీళ్ళూ బూచిగా చూపారు. అందునా దీని వెనుక ఒక అభివృద్ధి చెందిన దేశం యొక్క ఎత్తుగడ ఉంది అనే ఒక సహజ వ్యతిరేకతను ఊతంగా వాడుకున్నారు. ఇదే డాక్యుమెంటరీని – కమర్షియల్ ఉద్దేశ్యంతో కాక మన దేశంలో వాళ్ళే తీసి ఉన్నారనుకోండి – అప్పుడు డాక్యుమెంటరీ ఆ కారణం చేతనే గొప్పదైపోతుందా? కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా గ్రహించేదేంటంటే – ఈ వ్యతిరేకత డాక్యుమెంటరీలో ఉండే విషయం మీద కాదు అని. డాక్యుమెంటరీ తీస్తే దేశం ప్రతిష్ట దెబ్బ తింటుంది అని చెప్పకనే చెప్తూ ఉంటారు. తీయకపోతే మెరుగు పడుతుందా మరి?

ఎంతో విజ్ఞులై ఉండాల్సిన లాయర్లే ఈ దేశంలో ఒక స్త్రీ పట్ల తప్పుడు అభిప్రాయలతో ఉన్నారు, రేప్ చేసిన దుర్మార్గులు రేప్ కు ఒక లాజిక్ వెతుక్కుంటున్నారు.. వంటి విషయాలను సెల్యులాయిడ్లో పట్టడం ఎలా తప్పవుతుంది? రేప్ భారత దేశంలో జరిగింది కాబట్టి కన్సెషన్ ఇవ్వాలా? ఇన్ని రేప్లు పబ్లిగ్గా జరిగినప్పుడు తల ఒంచుకోలేని ఈ గొప్ప భారత సమాజానికి –

పి. విక్టర్ విజయ్ కుమార్

patrika.kinige.com