Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
SmartPrep.in
ఆదేశిక సూత్రాల లక్షణాలు
- వీటికి న్యాయస్థానాల న్యాయ సంరక్షణ లేదు. ఇవి స్వయంగా అమల్లోకి రావు.
- ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శకాలు.
- మన దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించి, సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించి, సంక్షేమ రాజ్యాన్ని సాధించడం వీటి లక్ష్యం.
- ప్రవేశికలోని ఆశయాలకు ఆచరణ రూపాన్నిస్తాయి.
- ప్రాథమిక హక్కులకు పోషకులుగా ఉండి, వాటిలోని వెలితిని పూరిస్తాయి.
- శాసనసభకు, కార్యనిర్వాహక శాఖకు స్నేహితుడిగా వ్యవహరిస్తాయి.
- సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తాయి.
రాజ్యాంగంలో వివరణ
ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు వివరించారు.
ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
- సామ్యవాద/ శ్రేయోవాద నియమాలు : ఆర్టికల్స్ 38, 39, 41, 42, 53
- గాంధేయ నియమాలు : ఆర్టికల్స్ 40, 46, 47, 48, 49
- ఉదారవాద నియమాలు : ఆర్టికల్స్ 44, 45, 50, 51
SmartPrep logo
SmartPrep
For more information log on to http://SmartPrep.in