Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

41

భారతీయాంగ్ల కవులు

ఆమెకు విదేశాలలో చదవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు. ఉర్దూ, తెలుగు, బెంగాలీ, పర్షియన్, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం వున్న కవయిత్రి. దాదాపు పదహారేళ్ళ చిన్న వయస్సులో సరోజిని హైదరాబాదు వాస్తవ్యుడైన డాక్టర్ గోవిందరాజులు నాయిడిగారితో ప్రేమలో పడింది. ఆ-ంధ్రా నాయుడైన ఈ యువకుడితో ఈమె సంపర్కం బెంగాలీ తల్లిదండ్రులకి జాతిపరంగా కూడా నచ్చలేదు. వయస్సులో కూడా చిన్నదైన ఈమెను మధ్యవయస్కుడైన డాక్టరుతో వివాహానికి తల్లిదండ్రులు వ్యతిరేకులవటంతో స్కాలర్షిప్ నెపంతో ఆమెని పై చదువులకి ఇంగ్లాండు పంపటం జరిగింది.

భారతదేశానికి తిరిగి వచ్చి ఏ గోవిందరాజులు నాయుడిని పెళ్ళాడటానికి తల్లిదండ్రులు వ్యతిరేకించి ఆమెని ఇంగ్లాండు పంపారో ఆ నాయుడిగారిని తన పందొమ్మిదో ఏట వివాహం చేసుకుంది. జయసూర్య, పద్మజ, రణధీర్, లీలామణి అని నలుగురు పిల్లలని కంది. అనారోగ్యంతో మంచమెక్కింది. పుంజుకుని గాంధీజీ అనుయాయిగా అతనితో అడుగులో అడుగు కలిపి స్వాతంత్ర సమరంలో పాలు పంచుకుంది. గాంధీగారితో పాటు ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణ ఉద్యమాల్లో పాల్గొనటమేకాక ఇండిగో కార్మికుల కోసం నడిపిన పోరాటంలో ముందుండి పాలుపంచుకుంది. అంతేకాకుండా రోజుల్లో స్త్రీల హక్కులకోసం పోరాడిన వారిలో ఈమె ప్రముఖురాలు. భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి మహిళా అధ్యక్షురాలు. గాంధీజీ తోనేకాక, జవహర్ లాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవియా, గోపాలక్రిష్ణ గోఖలే వంటి ప్రముఖులెందరితోనో సన్నిహితంగా ఉండి ఎన్నోరకాలుగా భారత స్వాతంత్ర సమరంలో తిరుగులేని నాయకురాలుగా పేరుపొందింది. ఈసందర్భంగా అనేకసార్లు జైలు పాలయ్యింది. దాంతో ఆరోగ్యం మరింత దెబ్బతింది కూడా.

ఇక కవితావ్యాసంగానికొస్తే స్వాతంత్ర సమరంలో చేరిన తర్వాత తన కవితావ్యాసంగానికి స్వస్తి చెప్పింది. ఇంగ్లాండు దేశంలో కింగ్స్ కాలేజిలో విద్యనభ్యసించిన రోజులలోను తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన క్రొత్త దినాలలోనూ అనేక విషయాలమీద కవితలల్లింది. ఈమె అదృష్టంకొద్దీ ఇంగ్లాండులో ఎడ్మండ్ గోస్, ఆర్థర్ సైమన్స్ వంటి కవితా దిగ్గజాలతో ఈమెకి పరిచయమైంది. వీరు సరోజిని కవితలని చదివి సంతోషించికూడా ఆమెకు జీవితాంతం పనికి వచ్చే కొన్ని సలహాలనిచ్చారు. సరోజిని తన కవిత్వంద్వారా ఆంగ్ల దేశపు పుష్పాలనీ పక్షులనీ గురించీ పాడడంకంటే తన స్వంత దేశపు పువ్వులని పక్షులనీ తదితర ప్రకృతినీ ప్రతిబింబించే కవితలు రాస్తే మంచిదని సలహాలనిచ్చారు. దాంతో సరోజిని భారతీయ దర్శనం మొదలయిందని చెప్పాలి. భారతదేశపు గాలి నీళ్ళూ, ప్రకృతి, దేశపు బజార్లు, వీధివ్యాపారస్తులు అన్నీ ఆమె కవితల్లో చోటుచేసుకోవటం మొదలెట్టాయి. బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ది రాయల్ టూంబ్స్ ఆఫ్ గోల్కొండ లాంటి కవితలెన్నో నవాబు లేలిన హైదరాబాదు గురించి వ్రాసింది. క్వీన్స్ రైవల్ అనే ఒక కవిత ఎన్నో స్కూళ్ళలో పిల్లలు చదువుతూ వుంటారు. ఇది ఒక పెర్షియన్ రాణిని గురించిన కథ. తన రాజభోగాలతో విసుగెత్తిన రాణి ఎప్పుడు చూసినా తనను పరివేష్టించి వుండే భోగభాగ్యాలనుంచి మార్పుని కోరుకుంటూ తన అసంతృప్తిని రాజుకి తెలియజేస్తుంది, తనకొక ప్రతిద్వంది కావాలనే విచిత్రమైన కోరిక కోరుతుంది. రాజు రాత్రికి రాత్రి ఆమె కోరిక తీర్చటం కోసం ఏడుగురు రాజకుమార్తెలని దేశవిదేశాలనుంచి తెచ్చి ఆమె ముందు నిలబెడతాడు. వాళ్ళెవరూ ఆమె అందానికి సాటిరారు. అదే అసంతృప్తి, అదే అశాంతి ఆమె మనస్సులో. అప్పుడు ఉన్నట్టుండి ఆమె ఏడేళ్ళ కుమార్తె పరుగుపరుగున వచ్చి ఆమె చేతిలోని అద్దాన్ని లాక్కుని తన ముంగురులు సరిదిద్దుకుంటుంది. రాణి పకాలున నవ్వుతుంది. "నా ప్రతిద్వంది నాకు దొరికింది, ఇదిగో" అని రాజుకి చెప్పి ఆనందపడుతుంది. అల్లాగే కోరోమండల్ ఫిషర్స్, బాంగిల్ సెల్లర్స్, ఇండియన్ వీవర్స్ లాంటి కవితలు భారత శ్రామికవర్గ సౌందర్యం గురించి వ్రాసింది. తన బాధలు, ప్రేమకోసం పరితపించటం, తన కష్టాలు, తన సుఖాల వల్ల తను పొందిన ఆధ్యాత్మిక ఆనందం, ఆత్మార్పణలోని ఔన్నత్యం, దానినుంచే ఉద్భవించిన అసంతృప్తులు, భగవంతుడిపట్ల భక్తి. ఏ మతాల సరిహద్దులచేత బంధింపబడని ఒకానొక విశ్వజనీనమైన ప్రేమ - ఇవన్నీ ఈమె కవిత్వంలో కనిపిస్తాయి. భారతీయాత్మని మనకి గోచరం చేస్తాయి. గోల్డెన్ థ్రెషోల్డ్, ఫెదర్ ఆఫ్ డాన్, బ్రోకెన్ వింగ్ అనే మూడు సంకలనాలు ఆమె జీవితకాలంలో ప్రచురింపబడినాయి. తర్వాత రచనల సంపూర్ణ సంకలనం వెలువడింది. ఆమె వ్రాసిన ఉత్తరాలు, చేసిన

కౌముది

www.koumudi.net