Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

సమగ్ర కంటి పరీక్షల శిబిరాలను సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందున అందుకు తగ్గట్లుగా గజ్వేల్ లో ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరాలతోపాటు సిఎం ప్రజలతో మమేకం అయ్యే విధంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఆ కార్యక్రమానికి సరిపోయే విధంగా సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు.

*గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతిలకూ చికిత్సలు*

సాధారణ కంటి సమస్యలను పరీక్షించి, చికిత్స, మందులు, కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడమే గాక, గ్లకోమా, డ
యాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలకు కూడా చికిత్సలు అందేలా చూడాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు
చెప్పారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడవద్దన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ చేపట్టిన ఈ పథకాన్ని విజయ
వంతం చేయాలన్నారు.

*సమగ్ర కంటి పరీక్షలకనుగుణంగా కంటి దవాఖానాల అభివృద్ధి*

సమగ్ర కంటి పరీక్షల వల్ల కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు గుర్తింపులోకి వస్తారని, అలాంటి వాళ్ళకి
సరిపోయే విధంగా ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం
ప్రభుత్వ రంగంలో బాగా పని చేస్తున్న సరోజనీ కంటి దవాఖానా, వరంగల్ లోని ప్రాంతీయ కంటి ద
వాఖానాతోపాటు, ప్రాథమిక స్థాయిలో పలు కంటి దవాఖానాలను అభివృద్ధి పరచాలని అందుకు ప్రణాళికలు
సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

*కంటి శిబిరాల పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్లకు*

కంటి శిబిరాల నిర్వహణా బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాల కలెక్టర్లు
ఆయా బాధ్యతలను నిర్వర్తిస్తారన్నారు. అయితే, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్ల సూచనలు, సహకారం
తీసుకోవాలని మంత్రి చెప్పారు.

*10 పూర్వ జిల్లాల్లో మంత్రి పర్యటనలు*

కంటి వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించడానికి వీలుగా, తాను పూర్వ 10 జిల్లాల్లో పర్యటిస్తామ
న్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను కలిసి వారిని భాగస్వాములను చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, సమీక్షలు జరుపుతామన్నారు. అలాగే ప్రజాప్రతినిధులకు వైద్య
ఆరోగ్య శిబిరాలపై లేఖలు రాస్తామని మంత్రి అధికారులకు తెలిపారు.