Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales4
అనగనగా ఓ మంచి కథ
‘ఒకరూ, అతనంటే యిష్టం కలిగింది.’
‘ఎంత?’
‘బాధపడుతూన్న అతనికీ బాధపడే రోజులున్నాయని తెలిసిన నాకూ ఒక వాత్సల్యం ఏర్పడింది.’
‘మీకు తెలుగు బాగా వచ్చునే!’
‘అవును పరీక్షల్లో పోయేది ఎప్పుడూ.’
‘నర్సుపని ఎందుకు మానేశారు?’
‘ఆ రోగి పోయాడు. తిరిగీ ఆ హాస్పిటలులో వుండలేకపోయాను.’
‘మరి ఎందుకు సైన్యానికి నర్సుగా చేరారూ?’
‘కొన్నాళ్ళు యీజిప్టు దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత రాలేదు. '
‘ఆహాఁ!’
‘తర్వాత అతని భుజంలోంచి గుండు దూసుకు పోయిందని వార్తవచ్చింది.’
‘పాపం!’ అతను అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
‘బ్రతికి వున్నాడో లేదో తెలియదు.’
ఆమె నుదుటి మీద పడే ముంగురుల్ని వణికే చేతితో సవరించుకుంది. 'అప్పటినుంచీ సంక్షోభంగా వుండేది మనస్సు. నేనూ కలకత్తా వచ్చి యీ సైన్యదళాలకి నర్సుగా చేరాను.’
‘ఇక్కడ శాంతిగా వుందా?’
‘లోని కంగారుని అణచివేస్తోంది ఈ యుద్ధ సంక్షోభం. ఒక్కొక్కసారి యీ సోల్జర్లలోనూ ఆయన ఉన్నాడా అనిపిస్తుంది.' అతనికేమనాలో తోచలేదు. 'చీకటి బావుంటుంది.' అన్నాడు. జేబులో చెయ్యిపెట్టి తీసివేశాడు. ఇద్దరూ రోడ్డు చివరకి వచ్చారు. దూరంగా పెద్ద మైదానంలో చిరుకాంతిలో డేరాలు కనపడ్డాయి. ఒక సన్నని గొంతుక పాడుతూన్నట్టు వినబడుతోంది. మైదానంలో యిక్కడా అక్కడా ఒకరిద్దరు కూర్చున్నారు.
‘ఏమిటిదీ?’ అంది ఆమె.
‘బర్మా నుంచి వచ్చిన వాళ్ళ క్యాంపు.’
‘వెళుదామా?’
‘ఆఁ!’
ఇద్దరూ ఆ డేరాల వైపు నడవసాగారు. అంత రాత్రివేళ కొందరు డేరాలకి దూరంగా కూర్చుని ఉన్నారు. కొన్ని చోట్ల ఒక స్త్రీ పురుషుడూన్నూ. మెల్లగా వీచే గాలిలో వాళ్ళ గుసగుసలు వినబడుతున్నాయి డేరా సందులలోంచి వెలుగు సన్నగా పాకి యిసుక మీద పడి మెరుస్తోంది.
‘వీళ్ళు భార్యా భర్తలా!’ అంది ఆమె.
‘అవచ్చును. ఏం చెప్పగలం?’ అన్నాడతను.
డేరాలు సమీపించారు. కొందరు పోలీసులు కనులు సగం తెరచి నిద్రపోతున్నారు. డేరాలకు కొలది దూరంలో షెల్టర్లు వున్నాయి. డేరాలలో పెట్టెలూ, సామానులూ, పేర్చబడి వున్నాయి. క్రింద చాపలమీద అనేకులు వృద్ధులూ, స్త్రీలూ, బాలురూ పడుకొని వున్నారు.
‘ఎంతమందో!’ అంది ఆమె.
‘ప్రతి పట్టణంలోనూ వున్నారు.’ అన్నాడతను.
ఒక చంటిపిల్ల 'కేరు' మంది. ఏడుస్తూ ప్రక్కకి దొర్లి మరొకరి వొళ్ళోకి వెళ్ళింది అతను విసుక్కుంటూ ఆ పిల్లని తోసివేశాడు. ఆ పిల్ల గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది. ఇంతలోకే ఒక వృద్ధుడు లేచి, ఆ పిల్లను ఎత్తుకొని, ఓదారుస్తున్నాడు. ఆమె అడిగింది. ‘తల్లి లేదూ?’ ఆ వృద్ధుడికి అర్థమవలేదు తిరిగీ ఆమె యింగ్లీషులో అడిగింది. ఆ వృద్ధుడు అతి కష్టం మీద మాటలు పోగు చేసుకుంటూ యిలా చెప్పాడు. ఆపిల్ల తన కూతురు కూతురనీ, తన
కౌముది
www.koumudi.net
డిసెంబర్ 2017