Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesమన పర సమూహాలు
ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు జారిపోయింది. ముందుగా 'రియాలిటీ చెక్' రాస్తున్నప్పటి ఒక సంగతి. పెట్ హాస్పిటల్ వాతావరణం ఎలా ఉంటుందో రాయడం నా ఉద్దేశం కాబట్టి, ఇది అందులో కలిపితే ఆర్టికల్ రంగు మారిపోతుందని అప్పుడు పేర్కొనలేదు. ఆ పెట్ హాస్పిటల్ మేనేజర్ నన్ను అంతా తిప్పి చూపించాక, ఆ ప్రదేశానికి సంబంధించిన టోపోగ్రఫీ నాకు ఓ ఐడియా వచ్చాక, ఇద్దరమూ అలా క్యాజువల్గా మాట్లాడుకుంటుండగా, ఒకామె తన పెంపుడు కుక్కతో వచ్చింది. ఆ కుక్కకు వచ్చిన జబ్బు గురించి ఆ ఇద్దరాడవాళ్లూ కాసేపు ఇంగ్లీషులో మాట్లాడుకున్నారు. మన దగ్గరి ప్రతి ఆంగ్ల సంభాషణా ఏదో ఒక దశలో తెలుగులోకి కూడా మళ్లుతుంది కాబట్టి, కాసేపు తెలుగులోనూ ముచ్చటించారు. ఆమెను సంబంధిత డాక్టర్ దగ్గరికి పంపించేశాక, మళ్లీ నాతో ఆగిపోయిన సంభాషణ కొనను అందుకోవడానికి ప్రారంభంగా ఈ మేనేజర్ - “వీళ్లు ఇంగ్లీష్ మాట్లాడితే బానే వుంటుంది గానీ తెలుగు మాట్లాడితేనే తెలంగాణ బయటపడిపోతుంది,” అంది. ఆ అనడం అయితే అనేసిందిగానీ, ఆ వాక్యానికి పుల్స్టాప్ పెట్టేసేలోపే ఆమెకు సందేహం వచ్చినట్టుంది, మరి నేను ఎక్కడివాణ్నని.
ఆ హాస్పిటల్ ఓనర్ మహబూబ్నగర్ అని తెలిసివుండీ ఆమెను అలా మాట్లాడించేలా ప్రేరేపించిన సాంస్కృతిక అహంకారానికి ఆమెను ఒక్కదాన్నే బాధ్యురాల్ని చేయడం నాకు ఇష్టం లేదు. పైగా, ‘మనవాడు' అని నమ్మి చేసిన ఒక యధాలాప వ్యాఖ్యానంలో! అందుకే, ఇప్పుడు నా స్వస్థలం చెబితే ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందేమోనని నేను ఇబ్బందిపడ్డాను. అందుకే ఆ భావం మీద ఆమెను ఎక్కువసేపు ఉండనీయకుండా వేరే టాపిక్లోకి దించేశాను.
నిజానికి 'మన' అన్నది పెద్ద రూపం ఉన్నదేమీ కాదు. అది రకరకాల కాంబినేషన్లుగా మారిపోతుంది. తెలుగువాళ్లు, బ్రాహ్మణేతరులు, దళితేతరులు, శ్రీవైష్ణవులు, వెలమలు, దక్షిణాదివాళ్లు, పాశ్చాత్యులు... ఇందులో ఎక్కడ మన అవుతాం, ఎక్కడ పర అవుతాం అనేవి ఉట్టి గీతలే. అవి ఏకకాలంలో అర్థంలేనివీ, బలమైనవీ కూడా! మా సెవెన్త్ఫ్లోర్ వాళ్లు, మా శారదానగర్ వాళ్లు, మా కరీంనగర్ వాళ్లు, మా వేములవాడవాళ్లు... మా ఊరిలోనే మా పూడూరోళ్లు, కొత్తోళ్లు
మన పర సమూహాలు
పూడూరి రాజిరెడ్డి
patrika.kinige.com