Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesకాయని కలిపితినటం మంచిది. పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇంఫెక్షన్ వంటి చర్మ సమస్యలను కూడా పుచ్చకాయ పోగొడుతుంది.
నేరేడు: నేరేడు లోపలి పండులో కన్నా పైనున్న తొక్క చాలా పోషకాలను కలిగి ఉంటుంది.
ఇది కాన్సర్ కు విరుగుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. రోజుకు 10-12 నేరేడుపండ్లు తింటే కాన్సర్ కు దూరంగా ఉండవచ్చు. నేరేడు రుచికి తీయగా వంకాయ రంగులో ఉంటుంది.
కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు..
బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహ రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
సపోట: సపోటా పండ్లలో, పిండి పదార్థాలు, ఫ్రక్టోస్ షుగర్లు, కెరోటిన్లు, థయామిన్, రైబోప్లేవిన్లు, నియాసిన్, సి విటమిన్, ఇనుము, క్యాల్షియం, పీచు, లభిస్తాయి. అయితే ఎ విటమిన్ ఎక్కువగాను, బి విటమిన్లు తక్కువగాను ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, రాగి వంటి ఖనిజలవణాలు కొద్దికొద్ది మోతాదులో ఉంటాయి. ఇది శరీర బరువును పెంచటానికి సహాయపడుతుంది. బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే నిముషాల లో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది. సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మల విసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడవచ్చును. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ సుగుణాలను కలిగి ఉన్నాయి. ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి.
పోషక విలువలు 100 గ్రాములకు