Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesనీ వాక్యము నన్ను బ్రతికించియున్నది. కీర్తనలు 119:50
నీ వాక్యములు వెల్లడిఅగుట తోడనే వెలుగు కలుగును. కీర్తనలు 119:130
వాక్యపు వెలుగు
4. నా హృదయం తేటగా ఉండాలి:
సామె 15:11 పాతాళమును అగాధకూపమును యెహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి
తేటగా ఆయనకు కనబడును గదా?
5. నా ప్రవర్తన తేటగా ఉండాలి:
1 యోహాను 3:10 దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును,
తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
6. నా మార్గములు తేటగా ఉండాలి:
కీర్తనలు 25:4 యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము.
7. నా పని(పరిచర్య) తేటగా ఉండాలి:
1 కొరింధీ 3:12,13 ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు
మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత
బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును
8. నా బోధ(క్రీస్తును గూర్చిన మర్మము) తేటగా ఉండాలి:
Ephesians(ఎఫెసీయులకు) 3:8,9,10,11 - దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము
చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము
ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని (మూలభాషలో-అడుగుజాడలు పట్ల శక్యముకాని)
క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు
పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేకగృహనిర్వాహకత్వము) ఎట్టిదో
అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
9. నా జీవితం క్రీస్తు పత్రికలవలె తేటగా ఉండాలి:
2 కొరింథీ 3:3 రాతిపలక మీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద
జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయైయున్నారని మీరు
తేటపరచబడుచున్నారు.
ALERT:2 కొరింధీ 3:14-16
మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాతనిబంధన
చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి
వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీద నున్నది గాని వారి హృదయము
ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
మనము అన్ని విషయములలో తేటగా ఉండునట్లు పరిశుధ్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక.... ఆమెన్
శ్రమల కాల ధ్యానములు
ఉచితము
తేటగా - Page 2 of 2