Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesసాహసం:
సరైన భావిష్యతులోనికి సమూహాన్ని నడిపించుటకు ఏమేమి అవసరం? సాహసం చాల ప్రాముఖ్యం. ఏ ఒక్కరు భవిష్యతును ముందుగానే తెలుసుకోలేరు, కాని దేవుని కృప చేత ఇవ్వబడిన జ్ఞానం ద్వార భవిష్యతును కొంతవరుకు నిర్ధారించుకోవచ్చు.
మంచి నాయకులు ఇతరులు చెప్పేది వింటారు. ఉతమమైన నూతన పచ్చిక ప్రాంతాలను తెలుసుకోవడానికి ఒక కాపరి ఇతర కాపరులనుండి కూడా సలహాలు తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, మందను అలా కొత్త పచ్చిక ప్రాంతాలకు నడిపించాలి అనే నిర్ణయం తీసుకునే ముందు, అవకాశం వుంటే కాపరి ఖచ్చితంగా అక్కడి పరిస్థితులను పరిశీలించును.
నాయకత్వంలో ఎప్పుడూ తెలియని అంశము ఉంటూనే వుంటుంది. కాని అలాంటప్పుడే ఇంకా ఎక్కువగా నమ్మకం చూపించాలి, దానినే విశ్వాసం అని పిలుస్తాం. మంచి నాయకత్వం ఎప్పుడూ సత్యం మరియు విశ్వాసం కలయికతోనే వుంటుంది కాని సత్యం మరియు భయంతో కాదు. పాతనిభందనలో, మోషే ఎలాగ ఒకో గోత్రం నుండి 12 మంది గూఢాచారులను వాగ్ధాన భూమిని అన్వేషించడానికి పంపించడం చూస్తాం. వారిలో 10 మంది గూఢాచారులు తిరిగి వచ్చి సమాచారాన్ని సత్యం మరియు భయంతో కలిపి ఈ విధంగా చెప్పారు 'అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి...' (సంఖ్యాఖాండము 13:28). మిగతా 2 మంది గూఢాచారులు, కాలేబు, యెహోషువా, సత్యం మరియు విశ్వాసం తో కలిపి 'కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.' (సంఖ్యాఖాండము 13:30)
క్రైస్తవ నాయకులు, నాయకత్వం గురించి నిర్లక్ష్యంగా ఉండకపోవడం మాత్రమే కాదు, వారు ముందుకు సాగాలంటే వారి ముగింపు సత్యం మరియు విశ్వాసం రెండింటిని సూచించాలి. మాక్స్వెల్ వ్రాస్తూ ' నీ మనస్సులో చిన్న ప్రయాణాన్ని నమ్మకంతో చేయలేకపోతే, నిజజీవితంలో నీవు చేయలేవు' అని చెప్పెను. అయినప్పటికీ దానికి సాహసం చాల అవసరం, నిజానికి దేవునిపై నమ్మకం కావాలి.
పరిశుద్ధాత్మ అభిషేకం:
ఈరోజు ఎంచుకున్న అంశం యొక్క రహస్యం, అనగా ముఖ్యంగా రూపశిల్పిగా (భవిష్యత్తుకు) లేక కాపరిగా ఉండటానికి, దేవుని అభిషేకం నీ పై వుండాలి. ప్రతీ క్రైస్తవుడు తప్పనిసరిగా 'ఆత్మచే నింపబడాలి' (ఎఫెస్సియులకు 5:18). అలాగైతే నాయకునికి అభిషేకం ఇంకెంత అవసరం? దేవుని అభిషేకం నీపై ఉంటేనే, కాపరిగా లేక రూపశిల్పిగా,