Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ఇప్పటికే భారీ ఐటి పెట్టుబడులకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరం హెల్త్ కేర్ సర్వీసెస్ రంగంలోనూ వేగంగా అభివృద్ధి సాధిస్తూ వస్తున్నది. ప్రపంచ అతిపెద్ద హెల్త్ కేర్ సర్వీసెస్ సంస్థ అయిన యునైటెడ్ హెల్త్ కేర్ గ్రూప్ కు భారతదేశంలోనే అతిపెద్ద ఉనికి హైదరాబాద్ నగరంలోనే ఉన్నది. గత నాలుగేళ్లలో యునైటెడ్ హెల్త్ కేర్ గ్రూప్ సుమారు 8 లక్షల 30 వేల చదరపు అడుగుల ఫెసిలిటీ తో తన కార్యకలాపాలను విస్తరిస్తూ వస్తున్నది.

హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీలకు హబ్గా హైదరాబాద్ మారడం ప్రతి మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. Anthem కంపెనీ తన కార్యకలాపాలకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల ఆయన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ కార్యకలాపాల ద్వారా నూతనంగా రెండువేల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు మరిన్ని పరోక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. కంపెనీ విస్తరణ కోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం వైపు నుంచి అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి అవసరమైన మానవ వనరులను అందించేందుకు అవసరమైతే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ( టాస్క్) ద్వారా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.