Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesప్రవేశం చేసినట్లు ఆయన ఈ కాలం నుంచి వందేళ్ళు వెనక్కి ‘పరకాల ప్రవేశం' చేసాడు. ఇదంతా ఎలా సాధ్య పడింది? ఎలాగంటే అతనికి మనుషుల ప్రకృతి అర్థమయింది. ఇదంతా రచయిత కథనశక్తి అనుకుంటే మనుషుల ప్రవర్తన, పరిసరాలు ఈ నైరూప్య ప్రపంచంలోని సూక్ష్మాతిసూక్ష్మమైన అంశాలను దాటుకుని కంటికి కనపడని మానవ సహజాత సూత్రాలని, అందుమూలంగా భూమి చేతులు మారి రూపం మార్చుకున్న వైనాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరొక విషయం.
ఒక క్రాంతదర్శి భవిష్యత్తును ఊహించగలడు. భవిష్యత్తు ఎలాగైనా జరగొచ్చు. ఊహించడం తేలిక. కాని గతం అలా కాదు. అది జరిగిపోయిన దానిని ఊహించడం అంత తేలిక కాదు. గతానికి కొన్ని కొలతలు ఉంటాయి. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన సింగమనేని నారాయణగారు 'నవల మొత్తమంతా రచయిత కంఠస్వరం పాఠకుడు వినగలిగేలా మ్రోగుతూనే ఉంటుంది' అని పాజిటివ్గానే అన్నా ఈ నవలలోనిది రచయిత కంఠస్వరం లేని అనేక కంఠస్వరాలున్న polyphonic text. నరేంద్ర కథనంలో నాకు కనిపించేది ముఖ్యంగా చిత్రీకరణ. అదే ఆయన బలం కూడా. కథ చెప్పడం ఎంత ముఖ్యమో కథను చూపించడం కూడా అంతే ముఖ్యమైనది. రచనకు ప్రాధమిక లక్షణమైన వర్ణనలను అవలీలగా పుణికిపుచ్చుకున్న నరేంద్ర “రెండేళ్ళ పధ్నాలుగు” కథల సంకలనంలోని కథలనుంచి తన దృష్టినీ, దృక్పథాన్నీ విస్తరించుకున్నాడు. జీవితంలోని భిన్న పార్శ్వాలను, విలువలకున్న భిన్నకోణాలను చూపించడంలో ఆయన దృష్టి ఎంత విశాలమయిందో అంత లోతులకూ వెళ్ళింది.
ఈ నవల సారాంశం కోసం కోసం ఆసక్తిగా అనిపించే కొన్ని సంభాషణలు ఇక్కడ ప్రస్తావించడం అవసరం.. ఈ నవలలో భూమి తాలుకు మొదటి యజమాని మఠం. మఠం తరపు నుంచి వచ్చిన కొత్త సన్యాసి ఒకరు, కౌలుదారైన స్త్రీ ‘ఇలవరిసి’ తో ఇలా అంటాడు.
“మఠమోళ్ళు వొకవేళ నీకీ నేల యిచ్చేశారే అనుకో.. తర్వాతేం చేస్తావు?..”
“యవసాయం చేసుకుంటాము..”
“అదేగదా యిప్పుడు చేస్తున్నది గూడా!...”
“సొంత నేలలో యవసాయం జేసేదానికీ, కౌలుకు జేసేదానికీ తేడా లేదా?
కష్టపడిందంతా యెవురికో కిస్తీ గట్టాల్సిందేనా?...”
భూచక్రం అను ఒక Eternal Drama సామాన్య జీవితానుభవం patrika.kinige.com