Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ఇంటిని కట్టుకుంటున్నప్పుడు పాతదాని పట్ల వైరాగ్యం కలుగుతుంది.
-
అనంతమైన తండ్రి ఎలా ఉన్నారో చూడండి! మీకు స్వర్గం రూపీ ఇంటిని తయారుచేసి ఇస్తారు. స్వర్గము కొత్త ప్రపంచము, నరకము పాత ప్రపంచము. కొత్తది నుండి పాతదిగా అవుతుంది, మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం పాత ప్రపంచంలో ఉంటూ కొత్తదానిగా తయారుచేస్తున్నాము. మనం పాత శ్మశానవాటికపై పరిస్తాన్ ను తయారుచేస్తున్నాము. అదే యమునా నదీ తీరం ఉంటుంది, దానిపై మహళ్ళు తయారవుతాయి. ఈ ఢిల్లీయే యమునా నదీ తీరంలో ఉంటుంది. పాండవులకు కోటలు ఉండేవన్నట్లు చూపిస్తారు కదా, అవన్నీ డ్రామా ప్లాన్ అనుసారంగా తప్పకుండా మళ్ళీ తయారవుతాయి. మీరు ఎలాగైతే యజ్ఞాలు, జప తపాదులు, దానాలు మొదలైనవి చేసేవారో, అవి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ముందుగా శివునికి భక్తి చేస్తారు, ఫస్ట్ క్లాస్ మందిరాలను తయారుచేస్తారు, దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇది అవ్యభిచారి జ్ఞానము. ఇప్పుడు మీరు ఒక్క శివబాబా నుండే వింటారు. ఇంతకుముందు మీరు వారికి భక్తి చేసారు. ఆ సమయంలో వేరే ధర్మాలేవీ ఉండేవి కావు. ఆ సమయంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. దేవతా ధర్మం చాలా సుఖమిచ్చేటువంటి ధర్మం. ఆ పేరును తీసుకున్నప్పుడు నోరు మధురంగా అవుతుంది. మీరు ఒక్క తండ్రి నుండి మాత్రమే జ్ఞానం వింటారు. తండ్రి అంటారు - మీరు ఇతరులెవ్వరి నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారి జ్ఞానము. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మీకు తండ్రి నుండే నంబరువారు పురుషార్థానుసారంగా వారసత్వం లభిస్తుంది. తండ్రి కొద్ది సమయం కోసం సాకారంలోకి వచ్చారు. బాబా అంటారు - నాకు పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది, ఇది నా పర్మనెంటు శరీరం కాదు, నేను వీరిలో ప్రవేశిస్తాను. శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది. అప్పటి నుండి వారు ఈ జ్ఞానం వినిపించడం మొదలుపెడతారు. ఈ ఆత్మిక విద్యను పరమ ఆత్మ ఇస్తున్నారు. ఇక్కడ నీటి విషయమేమీ లేదు. నీటిని జ్ఞానమని అనరు. పతితం నుండి పావనంగా జ్ఞానం ద్వారా అవుతారు, నీటి ద్వారా పావనంగా అవ్వరు. నదులైతే మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడ జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి వీరిలో ప్రవేశించి జ్ఞానం వినిపిస్తారు. ఇక్కడ గోముఖానికి వెళ్తారు. వాస్తవానికి గోముఖమంటే చైతన్యంలో ఉన్న మీరే. మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది. గోవు నుండైతే పాలు లభిస్తాయి, అంతేకానీ నీటి విషయం కాదు. ఈ విషయాలన్నింటినీ సర్వుల సద్గతిదాత అయిన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుడిని ఎందుకు కాలుస్తారు అనేది మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు అనంతమైన దసరా జరగనున్నదని మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపం వలె ఉంది. రావణ రాజ్యం మొత్తం సృష్టిపై ఉంది. వానర సైన్యముండేదని, వానరులు వారధి కట్టారని.... శాస్త్రాలలో ఉంది. ఇవన్నీ కల్పిత కథలు. భక్తి కొనసాగుతుంది, ముందు అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత వ్యభిచారి భక్తి ఉంటుంది. దసరా, రక్షాబంధనం ఇవన్నీ ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపనవుతుంది. నేడు కంసపురి ఉంది. రేపు కృష్ణపురి ఉంటుంది. కంసుడు అని ఆసురీ సంప్రదాయం వారిని అంటారు. పాండవులకు మరియు కౌరవులకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. కృష్ణుని జన్మ సత్యయుగంలో జరుగుతుంది. వారు మొదటి రాకుమారుడు. వారు స్కూల్లో చదువుకునేందుకు వెళ్తారు, పెద్దవారైన తర్వాత రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. మహిమంతా పతితులను పావనంగా తయారుచేసే శివబాబాదే. ఇకపోతే, ఈ రాసలీలలు చేయడమంటే పరస్పరంలో సంతోషాన్ని పంచుకోవడము వంటిది. ఇకపోతే, కృష్ణుడు ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించడమనేది ఎలా జరుగుతుంది. తండ్రి అంటారు - భక్తి చేయకండి అని ఎవరికీ చెప్పకూడదు. భక్తి దానంతట అదే వదిలిపోతుంది. భక్తి వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు, దీని గురించే గొడవలు జరుగుతాయి. తండ్రి అంటారు - నేను రుద్ర యజ్ఞాన్ని రచిస్తాను, ఇందులో ఆసురీ సంప్రదాయం వారి విఘ్నాలు కలుగుతాయి. ఇది శివబాబా యొక్క అనంతమైన యజ్ఞము. దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రకటితమయిందని అంటూ ఉంటారు. పాత ప్రపంచ వినాశనం జరిగిన తర్వాత, మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మనుష్యులంటారు - మేము శాంతి ఏర్పడాలి అని అంటాము, ఈ బి.కె.లు వినాశనమవ్వాలని అంటారు. జ్ఞానం అర్థం చేసుకోని కారణంగా ఈ విధంగా అంటారు. తండ్రి అంటారు - ఈ మొత్తం పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహా అవుతుంది. పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందరూ ఆవగింజల వలె నలిగి సమాప్తమైపోతారు. ఇకపోతే, కొంతమంది ఆత్మలు రక్షించబడతారు. ఆత్మ అయితే అవినాశీ. ఇప్పుడు అనంతమైన హోలిక జరగనున్నది. ఇందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఇకపోతే, ఆత్మలు పవిత్రంగా అయి వెళ్ళిపోతాయి. అగ్నిలో వేసినప్పుడు వస్తువు శుద్ధంగా అవుతుంది. శుద్ధత కోసమే