Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesవిభాగం — బి
4. క్రింది గద్యభాగమును చదివి, పేరా క్రింద ఇచ్చిన ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో
సమాధానములు వ్రాయండి.
7 x 1=7 మా.
కాల పరీక్షకు నిలిచిన కమనీయ కావ్యం వాల్మీకి రామాయణం. ప్రశంసించే వారికి, ప్రశ్నించే వారికి కూడా ప్రాచుర్యాన్ని కలిగించిన ప్రాచేతసుడి రచన లోకానికి లోకోత్తర మర్యాద పురుషోత్తముడని పరిచయం చేసింది. కొడుకుగా, సోదరునిగా, భర్తగా, ప్రభువుగానే కాదు. మామూలు మనిషిగా తోటి జీవుల పట్ల చూపవలసిన మాననీయతను ఉన్నత సంస్కారాన్ని రాముని ద్వారా ఉపదేశించింది. రేపటినుంచి నీవే రాజువి అన్నప్పుడు రాముడు ఆనందంతో ఎగిరి గంతులు వేయలేదు. రాజ్యం నీది కాదు, అరణ్యానికి బయలుదేరుమన్నప్పుడు దుఃఖంతో కూలబడనూ లేదు. బతుకును కోతులతో పంచుకోవలసి వస్తే ఆత్మన్యూనతకు లోనవనూ లేదు. అయోధ్యలోనూ భరతుడితో, కిష్కింధలో, విభీషణునితోనూ ఒకే తరహాలో ఉండగలిగాడు. రాముడి కారణంగా "చట్రాతికి కల్గే పావనము" అని బండరాయిలా ఉన్న అహల్య రామపాద స్పర్శతో పావన చరిత అయ్యింది. “అరాతికి రాజ్య సుఖంబు కల్గె" శత్రువర్గ విభీషణునికి రాజయోగం పట్టింది. "తిర్యగ్జాతికి పుణ్యమబ్బె" తిర్యక్కులు అంటే పశుపక్ష్యాదులలో జటాయువు వంటి పక్షికి పుణ్యలోకాలు దక్కాయి. “కపిజాతి మహత్వము నొందె” మొత్తం వానర జాతికే గౌరవం దక్కింది. “బంటు రీతి కొలువునీయవయ్య రామా” అని ప్రాధేయపడ్డాడు త్యాగరాజ స్వామి. పది కొంపలు లేని పల్లెలోనైన రామ మందిరము ఒకటుండి తీరాలని ఆరాటపడే జాతి మనది. “శ్రీరామ” అని రాయనిదే రచనే కాదు, ఉత్తరం ముక్క కూడా మొదలుపెట్టని సాంప్రదాయము మనది. ఈ భూమ్మీద పర్వతాలు, నదులు ఏమకాలం ఉంటాయో అంతకాలం నా కావ్యం ఉంటుంది అని స్థిరంగా ప్రకటించాడు వాల్మీకి.