Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

అవిఘ్నమస్తు

శుభమస్తు

శ్రీరస్తు

శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత పూజా విధానం

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో
దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో
రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు
ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర
దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత
సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము)
మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము)
శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం,
శుభతిథౌ, శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య
అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం,
ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్థం, ధన, కనక, వస్తు వాహనాది సమృద్ధ్యర్థం,
పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిధ్యర్ధం,
పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ అనంత
పద్మనాభ స్వామీ దేవతా ముద్దిశ్య శ్రీఅనంత పద్మనాభ స్వామీ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి
ధ్యాన, వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

For Pooja Information / Pandit Booking
Visit: www.poojalu.com
Cell: +919908234595 / +919908333463

Poojalu.com