Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

India strongly condemns the barbaric terrorist attacks in Afghanistan

May 12, 2020

ఆఫ్ఘనిస్తాన్లో అనాగరిక ఉగ్రవాద దాడులను

భారత్ తీవ్రంగా ఖండించింది

మే 12, 2020

మహిళలు, పిల్లలతో సహా అమాయక పౌరులపై అనాగరిక ఉగ్రవాద దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. తల్లులు, పసికందులు, నర్సులు మరియు శోకిస్తున్న కుటుంబాలను సహితము కబళించిన ఇటువంటి భయంకరమైన దాడులు ఖండించదగినవి మరియు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు.

మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.

ఇటువంటి ఉగ్రవాద చర్యలకు ఎటువంటి సమర్థన ఉండదు. ఇటువంటి దుర్మార్గమ చర్యలకు పాల్పడేవారు మరియు వారి స్పాన్సర్లు మరియు మద్దతుదారులను జవాబుదారీగా చేసి న్యాయం తీర్చాలి. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన మరియు ఈ ప్రాంతంలోని అసంఖ్యాక ప్రజలను అపారమైన దుఃఖమునకు గురిచేసిన వారి సురక్షితమైన స్వర్గాలను మరియు అనుమతించబడని మద్దతును నిర్మూలించటటు వారిని బలవంతం చేయాలి.

దేశానికి శాంతి మరియు స్థిరత్వాన్ని తోసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు, ప్రభుత్వం మరియు భద్రతా దళాలకు భారతదేశం సంఘీభావం తెలుపుతుంది. పవిత్ర రంజాన్ మాసం, ఉపవాసం మరియు ప్రార్థనల ప్రతిబింబించే కాలం. ఆఫ్ఘనిస్తాన్ కరోనావైరస్ వ్యాప్తి వల్ల తలెత్తే పరిస్థితిని ఎదుర్కొవటానికి ఉగ్రవాద హింసను మరియు సహకారాన్నీ వెంటనే నిలిపివేయాలని మేము పిలుస్తున్నము.

భారత ప్రభుత్వ పత్రికా ప్రకటన

మే 12, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and
may be referred to as the official press release.