Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

చేస్తూ తన స్వీయ కవిత "వసంతంలో హేమంతం" చదివి వినిపించారు. అలాగే నాట్స్ వారు నిర్వహిస్తున్న కథ, ఫోటో కవిత, కవితల పోటీల గురించి శ్రీ మల్లవరపు అనంత్ వివరాలను అందించారు. శ్రీ కాజా సురేశ్ బాపట్లకు చెందిన చిత్రకారుడి ఉత్తమ ఫోటోకి స్పందిస్తూ ఒక కవితను చదివారు. పల్లె పడుచు పెళ్ళి చూపుల సందడిని గుర్తు చేస్తూ శ్రీ అట్ల రంగారెడ్డి సభలో ఉన్న అందరినీ పల్లెటూరు విహారం చేయించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి "రాక్షస ఉగాది" కవితను శ్రీ షేక్ నసీం చదివారు.

టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ మండువ సురేష్ మాట్లాడుతూ “ఉగాది ఉత్సవాల ప్రధాన వేదికపై నిర్వహించాలనుకొన్న కవిసమ్మేళనం 69వ సదస్సులో అత్యంత ఆసక్తికరంగా జరగడం తమకు ఆనందంగా ఉంది” అన్నారు. టాంటెక్స్ కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు శ్రీ చామకూర బాల్కి, శ్రీ వీర్ణపు చినసత్యం, పాలక మండలి అధిపతి డా. సి.ఆర్.రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సభను ముగించే ముందు ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ తమ అవధానం అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల నుండి కొన్ని పద్యాలను కమ్మగా పాడారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉగాది కవి సమ్మేళనం పూర్తి స్తాయిలో చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, వెన్నుదన్నుగా నిలిచి జయప్రదం చేసినందుకు ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన డీ.ఎఫ్.డబ్ల్యూ హిందూ దేవాలయ యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, టీవీ5, టీవీ9, రేడియో తరంగిణి, రేడియో గానసుధ వారికి మరియు పసంద్ రెస్టారెంటు యాజమాన్యానికి కృతజ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.