Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales27
యుగళగీతం
ప్రతిభావంతురాలివో, ఎంత ధారాళంగా డబ్బులు ఖర్చు పెట్టగలవో.. బంగారు షాపులకి దేవాలయాలన్నంత భక్తిగా వెళతావని.. నేనే ఆకాశరామన్న టైపులో చెపుతాను. అప్పుడు నీ గురించి ఆమె ఏమనుకుంటుంది అన్న సమస్య ఉండదు. అయినా అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ముందుచూపుతో, జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మన ఇండియన్ ఫిలాసఫీ మన ఆర్ధిక, సామాజిక నేపథ్యం' అలాంటిది. సరదాగా తీసుకోవాలి కానీ ఆపాదించుకోకూడదు. అమెరికాలో వినియోగదారుడంటే ”కింగ్” తో సమానం. మనం చేసే కొద్దిపాటి రిటర్న్లకి ఆ కంపనీలేం దివాలా తీయవు... ఎంత లాభాలు ఆర్జించకపోతే అంతంత డిస్కవుంట్లు ఆఫర్ చేస్తారనుకున్నావు? డాలర్కి, పది డాలర్లకి కొంటే మాత్రం నామోషీ పడేది ఏముంది.. వాడిస్తున్నాడు కస్టమర్లు తీసుకుంటున్నారు. ఎవరి నెత్తి మీద టోపీ పెట్టడం లేదుగా..?” అన్నాడు.
"నేను చెప్పేది ఏదీ సీరియస్ గా తీసుకోకుండా జోకులు వేస్తావు కాబట్టే, ఇలాంటి నా Passions ఏవీ నీతో పంచుకోబుద్ది కాదు. ఎంతసేపూ అవి కొనుక్కున్నావు, ఇంత ఖర్చుపెట్టావు అంటున్నావే కానీ, మా ఆవిడకి డైమండ్స్ కొన్నాను అని చెప్పుకుని బడాయిలు పోతావే ఆ మాట ఎత్తవేంట"ంది శైలజ.
"మంచి పాయిటే పట్టుకున్నావే! అయినా ఇక నుంచి మరీ అంతలా ఎవరికి పడితే వాళ్ళకి, అలా చెప్పకూడదనుకుంటున్నాను శైలూ, ఈ ఇండియన్స్ బాగా బంగారు ఆభరణాలు గట్రా కొనుక్కుంటారు. వాటిని ఇళ్ళల్లో కూడా దాస్తుంటారని, అమెరికాలోని దొంగలు చాలామంది కనిపెట్టేసారు. ఈ మధ్య 'గోల్డ్ డిటెక్టర్స్' అనే వాటి సాయంతో బంగారం, ఇతర నగలు ఉన్న ఇళ్ళు కనిపెట్టి, దొంగతనాలకి పాల్పడుతున్నారట.. కాబట్టి ఇక్కడ నీతి ఏమిటంటే, ఖరీదయినవి కొనడమే కాదు, అలాగే వాటికి సృజనాత్మకత ఉట్టిపడే విలువ ఉండగానే కాదు అవి సురక్షితంగా ఉండే ఏర్పాట్లు చేసుకోగలగటం అన్నిటి కంటే ముఖ్యం.” అనే విలువైన మాట చెప్పాడు.
△ △ △
హెల్త్ ఇన్స్యూరెన్స్
”ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్” పేరు చెప్పి అప్పుడే పుట్టిన పసిపిల్లకి ఓ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు పే చెయ్యకపోవడానికి సంబంధించిన కథనం ఒకటి టీవీలో చూసిన శైలజకి పీకలదాకా కోపం వచ్చింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆడింది ఆట, పాడింది పాటలా ఉంది. కానీ అమెరికాలో ఉన్నంతకాలం వీటి బారినుంచి తప్పించుకోలేం కదా.. మరీ పసిపిల్లకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏమిటి? ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నా దిక్కులేకుండా పోతోందని నానా శాపనార్థాలు పెట్టుకుంది.
నిజానికి ఇన్సూరెన్స్ కంపెనీల మీద శైలజకి ఉన్న కోపం ఈనాటిది కాదనుకోండి. మూడేళ్ళ క్రితం, వాళ్ళ అత్తగారు అమెరికా వచ్చినప్పుడు, ఎవరో సలహా ఇచ్చారు కదా అని, అలాగే ఆవిడకి ఆరోగ్యం అంతగా బాగుండదని, ఓ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఉన్నట్టుండి ఓ రోజు అత్తగారి బీపీ అమాంతం పెరిగిపోవడం, ఎడమచెయ్యి లాగుతుండటంతో, ఎలాగూ ఇన్సూరెన్స్ ఉంది కదా చూపిద్దాం, అని అర్జంటు కేర్ కి తీసుకుపోయారు. వెళ్ళగానే వాళ్ళు ఎడ్మిట్ చేసుకుని, మారు మాట్లాడకుండా చకచకా ఆవిడకి టెస్టులు గట్రా చెయ్యడంతో పాటు, అర్జంటు కేర్లో ఓ బెడ్ అదీ కేటాయించి హడావిడి పడ్డారు. శైలజ అత్తగారికి తోడుగా ఉంటే,
కౌముది
www.koumudi.net