Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

3. తల్లి గర్భమునుండి ధనముదేడెవ్వడు
వెళ్ళిపోయెడి నాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జన చేసి విర్ర వీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము గుడువబోడు
పొందుగా మఱుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మములేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో ? దొరలకవునొ ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ ! దురిత దూర !

శ్రీ కాసుల పురుషోత్తమ కవి - ఆంధ్ర నాయక శతకము

4. రాజ కార్య పరుండు తేజోబలాధికు
దాంజనేయుడు భృత్యుడగుట జేసి
యమిత శౌర్యుడు ప్లవంగమ కులేశు డినజు
డఱలేని స్నేహితుడగుట జేసి
విమత మర్మజ్ఞుండు విశ్వాస భరితాత్ము
డల విభీషణు డాప్తుడగుట జేసి
సుమనస్కుల మనస్కులమృత వాక్యంబుల
బొసగ నాశీర్వదించుటను జేసి

లంక సాధించితివి గాని లావు చేత
నిర్జరారుల గెలువంగ నీ తరంబె ?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ!
హత విమత జీవ ! శ్రీ కాకుళాంద్రదేవ!