Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

మారు పేర్లతో కాంగీ-శక్తి సంస్థల నాయకులు C. P. I. (M. L.) పై
జరుపుతున్న దుష్ప్రచారం ఖండించండి!

ఇటీవల కొన్ని పత్రికలలో కాకినాడ విద్యార్థుల పేరుతో
సి. పి. ఐ. (యం. ఎల్.) పైన, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ
సంఘం లాంటి విప్లవ ప్రజా సంస్థలపైన అబద్ధపు వార్తలు,
దుష్ప్రచారం ప్రచురించబడ్డాయి. "మా పార్టీ గిరిజనులు తమ
గ్రామాలలో డిపో సారా దుకాణం పెట్టుకోనట్లయితే వెదురు బావు
ల్లోనికి రానివ్వటంలేదని, అలాగానట్లయితే వారికి రైతుకూలీ
సంఘంలో చేరినట్లు రశీదు యివ్వటంలేదని, మా పార్టీ సారాయి
కాంట్రాక్టర్లతో తాలూచీపడి గ్రామాలలో దుకాణాలు పెట్టించడం
జరుగుతున్నదని, లైసెన్సులేని దొంగ సారా దుకాణాలు మారు
మూల గ్రామాల్లో తలెత్తటానికి మేము సహకరిస్తున్నట్లు పై పెచ్చు
యిదంతా గిరిజనులు విమర్శిస్తున్నట్లు వాటిల్లో ప్రచురించబడింది.
" ఆ ప్రచారం అంతా కాకినాడ విద్యార్థులుగాని, గిరిజనులుగాని
చేస్తున్నది ఎంత మాత్రంగాదు వారి పేరుతో కాంగీ నాయకుడు
దేశాయ్, శక్తి సంస్థ నాయకుడు రామకృష్ణ మొ॥గు వారు పనిగట్టు
కుని బుద్ధిపూర్వకంగా మా పార్టీపై చేస్తున్న దుష్ప్రచారం యిది.
ఇదే ప్రచారం యిటీవల దేవరపల్లి గ్రామంలో పంచాయతీ మీటింగు
అంటూ ఒకటి జరిపి దేశాయ్ చేశాడు; చేస్తున్నాడు. కాని సారాయి
కాంట్రాక్టర్లతోగాని మరే యితర ధనిక, వ్యాపార సంస్థలు, అవ
కాశవాదులతో లాలూచీపడటం, మా పార్టీ విధానం ఎంత మాత్రం
గాదు; అలా ఎన్నడూ రాజీపడలేదు. ప్రజాసమస్యల పరిష్కారా
నికి ప్రజలను కదిపి, వారిపై జరిగే అన్నిరకాల దోపిడీ, పీడనల
నుండి విముక్తి పొందేలా పోరాడుతూ, ప్రజలను చైతన్యవంతు
లను చేయటమే మా పార్టీ ధ్యేయం. సారాయి సమస్యపై మా
పార్టీ విధానం కూడా దానికనుగుణంగానే వుంటుంది మినహా పార్టీ
నిధులుకొరకు ప్రజల ప్రయోజనాలను ఎన్నడూ పణంగా పెట్ట
లేదు. పైన పేర్కొన్న కాంగి, తదితర శక్తి సంస్థలే అన్ని సమ
స్యలలోవలెనే ఈ సారాయి సమస్యపై కూడా అవకాశవాద వైఖ
రిని అవలంభిస్తున్నాయి. ప్రజలకు యీరోజు ఒకమాట, మరుసటి
రోజు మరో మాట చెబుతున్నాయి. వాటి అభివృద్ధి నిరోధక, అవ
కాశవాద విధానాలను నిత్యం ప్రజలలో బహిర్గతంచేసి ప్రజలను
చైతన్యవంతులను చేస్తూవుండటం మూలంగా ఆ సంస్థల నాయకులు
మా పార్టీపైన, రైతుకూలీ సంఘం లాంటి ప్రజా సంఘంపైన
ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. తమ పేరుతో విమర్శిస్తే తమ
అసలు స్వభావాన్ని బయలు చేస్తుందని విద్యార్థుల పేరు దానికి
కదిలించారు. అసలు విషయం ఏమిటి: