Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesప్రత్యామ్నాయాలు వెతుక్కునేవాళ్లకు ఇలాంటిచోట ఉండడం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శేష జీవితాన్ని గడిపెయ్యడానికి బాగానే ఉంటుంది. అంత వరకే. 'మనం ఎటు పోతున్నాం?' అని ప్రశ్నించే వాళ్లకు మాత్రం అసంతృప్తి తప్పదు. నిజానికి ఇక్కడున్న వాళ్ళల్లోఎక్కువమంది విప్లవం వస్తుందనీ, ఆ తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయనీ సంపూర్ణంగా విశ్వసిస్తారు. ఇదొక రకమైన మతవిశ్వాసం. అటువంటి సమిష్టి ఆశాభావం, విశ్వాసం ఉండకపోతే వాళ్ళు బతకలేరు. అందుకే తమ నమ్మకాల్నిబలపరిచే వాస్తవాల్ని సేకరించి పోగు చేస్తారు, పంచి పెడతారు. విరుద్ధంగా ఉండే విషయాలు జరగనట్టే నటిస్తారు, లేదా ఇదంతా ప్రజావ్యతిరేక శక్తులప్రచారం అంటారు. ఇలా వాళ్ళజీవితాలు గడిచిపోతాయి”.
“మరి కొత్తవాళ్ళు ఎలా వస్తున్నారు?”
“ప్రధానంగా రెండు మార్గాల్లో. మొట్ట మొదటిది సామ్యవాద స్వప్నం లోని మహత్తర ఆకర్షణ. అన్యాయం, దోపిడీ నశించాలనీ, మనుషులందరూ సమానులే అనీ, అందరూ బతికి బాగుపడాలనీ మనిషన్నవాడెవడైనా కోరుకుంటాడు. చదువుకున్న మధ్య తరగతి వాళ్ళు, కొంతమంది అగ్రవర్ణస్తులు – అంటే మన బోటి వాళ్ళన్న మాట – ఈ దారిలో వస్తారు. మొదటితరం వాళ్ళల్లో మెజారిటీ వీళ్ళే. ఎక్కువగా కోస్తాంధ్ర వాళ్ళు. ఈ కమ్యూన్ లో ఉన్నది కూడా ఎక్కువగా వీళ్ళే. ఈ మధ్య కాలంలో ఈ ప్రవాహం బాగా ఎండి పోయి క్షీణించింది. ఇక రెండో మార్గంలోంచి వచ్చే వాళ్ళు మరో గత్యంతరం లేక ఉనికి కోసం పోరాటాలకు దిగినవాళ్ళు. అంటే గిరిజనులు, అట్టడుగు వర్గాలు, కొంతమంది దళితులూనూ. ఇప్పుడున్న సంక్షోభం మూలంగా ఈ ప్రవాహం ఉధృతంగా ఉంది. వాళ్ళు మధ్య తరగతిలోకి రాలేకపోతే ఇంకా ఉధృతం అవుతుంది. మన బోంట్లకు ఈ రెండో ప్రవాహంలో స్పేస్ లేదు. ఓ ఇరవై క్రిందట కాస్తంతఉండేది, ఇప్పుడు ఇంకేం మిగల్లేదు. అయితే నా సమస్య అది కాదు “.
“మరి?”
“ఎలా చెప్పాలి? ఇంకో చివరకి వెళ్లి ప్రయత్నిస్తాను... ఈ మధ్యే ఎక్కడో చదివాను – 'సోషలిస్టులు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. మార్క్సిస్టులు ఆ స్వర్గానికి సైద్ధాంతిక నిచ్చెనలు వేస్తారు, ప్రజలు నానాపాట్లూపడి అక్కడికిచేరుకోగానే కమ్యూనిస్టు నియంతలు అందర్నీశాశ్వతంగా నరకంలోకి నెట్టి తాళం వేస్తారు. వాళ్ళు మాత్రం తాళం జేబులో వేసుకొని స్వర్గంలో ఉంటారు' ”.
ఇద్దరు మావయ్యల కథ
ఉణుదుర్తి సుధాకర్
patrika.kinige.com