Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales3
భాగవతంలో రసగుళికలు
నరముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.
[8-219]
ఇలా వెళ్ళి ఆయనతో మొరపెట్టుకున్నారు. ఇందులో పోతన దేవతలు ఎలా అడిగారో చమత్కరించాడు. ఇక్కడ శివుణ్ణి శంకరుడని సంభోదించేడు – శంకరుడంటే సుఖాల్ని ఇచ్చేవాడని అర్ధం కదా? మనకి కావాల్సిన పని అవ్వాలంటే ముందు పొగడాలి; "..భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.” అంచేత ఇప్పుడు ఉబ్బులింగడితో అంటున్నారు.
సీ. భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!
దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ;
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ;
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ
గోరి భజింతురు కుశలమతులు;
సకల సృష్టి స్థితి సంహారకర్తవై
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ;
[8-222]
క. నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!
[8-223]
నీ యుదరము సర్వభూత నిలయము, నీవు ఆర్తత్రాయణ పరయణుడివి, బంధమోక్షములకు ప్రభువి నువ్వు; అందులో మళ్ళీ సకల సృష్టి స్థితి సంహారకర్తవి. అందుచేత దీన్ని నివారించగలవు.
నీలో పుట్టి నీలో లయిస్తాయి జగాలన్నీ. అంటే ఈ విషం నువ్వు పుట్టిందే సుమా, అని చెప్తున్నారన్న మాట. అందుచేత దీన్ని నువ్వే తీసేయగలవు.
క. కొందఱు గలఁ డందురు నినుఁ;
గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొందఱు; గలఁ డని లేఁ డని
కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!
[8-225]
కౌముది
www.koumudi.net
జనవరి 2015