Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales3
నాస్తి(న+అస్తి)
బతికున్నన్నాళ్ళు మొగుడికి లొంగలేదు...కొడుక్కి లొంగలేదు...పెత్తనం చేసింది. తనను కున్నది జరిపింది. జరిపించుకుంది. ఆఖరికి యముడిక్కూడా లొంగడం లేదు. యముడు గెలవడం తప్పదు, కానీ యెప్పుడే?
బాత్రూముకెళ్ళిన వంటావిడ యింకా రాలేదు. ఆశ్చర్యం వేసి, మామ్మ గదిలోనుండి వసారావేపు వెళ్ళా... అక్కడ పాలేరు పడుకుంటాడు. వాడొచ్చాడో లేదో చూద్దామనుకున్నా… వసారా తలుపు వేసుంది. వసారా తలుపుదాకా వెళ్ళాక వినిపించాయి. నిట్టూర్పులు... చాలా భారంగా వున్నాయి. గుసగుసలు...మూలుగులు...యెవరో యిద్దరున్నారు. వసారాలో...యెవరు?
వసారా తలుపు తీసి చూడచ్చు కాని తెరిచి చూడబుద్దెయ్యలేదు. పడుకున్నా... నిద్రరావడం లేదు. రాదు కూడా... వసారాలో దాంపత్యం యెవరిదో తెలుసుకోవాలి. యేదైనా యెదురు చూడ్డం చాలా కష్టం, కానీ తప్పదు... వసారాలో వున్న దెవరో మెల్లమెల్లగా అర్ధం అవుతోంది... కాని స్పష్టంగా తెలుసుకోవాలి...చాలాసేపు చీకట్లో సమయం తెలియలేదు...నిద్రరాలేదు..ఎదురుచూత ఫలించి, వసారా తలుపు తెరుచుకు వంటావిడ మామ్మగదిలోకి వచ్చింది. చిన్నగావున్న దీపాన్ని పెద్దదిగా చేసి, మామ్మ దగ్గరకెళ్ళి... పక్కబట్టలు చూసింది. పక్కబట్టలు తడిసినట్టులేవు వచ్చి దీపాన్ని తగ్గించి, లాంతరు గదిమూలగాపెట్టి పక్కమీదికి చేరుకుంది. తనువు అలిసినట్టుంది. వెంటనే నిద్రలోకి జారుకుంది.
కాసేపు యెదురు చూసి, మెల్లగా లేచాను. చప్పుడు చేయకుండా వసారాలోకి వెళ్ళా, సాంబడు సామ్రాజ్యాన్ని జయించిన వీరుడ్లా మైమరచి,గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు.
ఇంతగొప్పడ్రామా యెక్కడా చూడ్లేదు...అందుకే అర్ధంచేసుకునేసరికి చాలా సమయం పట్టింది. వచ్చి పడుకున్నా... నిద్రపట్టలేదు తలనిండా ఆలోచన్లు, యేవో అస్పష్ట ఆలోచనలు! నా ఆలోచనలు నాకే భయం వేసాయి. వీధిలో గంటలచప్పుడు, తెల్లారినట్టుంది. యెవరో యెడ్లని తోలుకుపొలానికెళ్ళూన్నారు. పూర్తిగావెలుగురాలేదు. గాని తూర్పుయెర్రబడింది. కళ్ళని నిద్రకమ్మేసింది.
తెలివొచ్చేసరికి, ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.నేను లేవడం చూసి వంటావిడ లోపలినుండి చిన్న బకెట్ తో నీళ్ళు తెచ్చి వీధరుగు మీద పెట్టి “మొహం కడుక్కో బాబు కాఫీ పట్టుకొస్తా” అంది.
యెప్పుడూ వేరే దృష్టితో చూడ్లేదుగానీ రాత్రి జరిగిన సంఘటన తర్వాత దృష్టి అప్రయత్నంగా అటుపోయింది. వయసు నలభై అయినా శరీరంలో బిగి తగ్గలేదు. అది పొడుచుకు కనిపిస్తోంది. రవికముడి రంకెలేస్తోంది. వంటావిద స్వరంలో నెమ్మది, కళ్ళల్లో అమాయకత్వం వెనుక కోర్కెల సమాధి,వెనుక యెతైన పిరుదులు, విచిత్రంగా లబ్జుగా వూగుతున్నాయి. సాంబడు అదృష్టవంతుడు!
ఆరోజు నేనెక్కడికీ పోలేదు. పగలల్లా నిద్రపోయాను. సాయంత్రం ఆచారిగారొచ్చి, మామ్మకి జ్వరతీవ్రత తగ్గుతోందని చెప్పిపోయారు. అంటే మామ్మమళ్ళీ యముడ్ని జయించి,ఈలోకం వేపు మళ్ళింది. యముడు నిస్సహాయంగా నిలబడి వింతగా చూస్తున్నాడు.
ఆరాత్రి నేను పడుకోలేదు. కానీ నేను వేసిన కాపు వృధాయింది. వంటావిడ సాంబడి పక్కలోకి వెళ్ళలేదు. యెదురుచూసి... యెదురుచూసి యెప్పుడో తెల్లవార్థమున నిద్రపట్టింది.
ఆరోజు మామూలే ఆచారిగారు చూడ్డానికొచ్చి, “ప్రాణం మహాగట్టిదోయ్” అన్నాడు.
ఆ విషయం అతడు చెప్పక్కర్లేదు. మాకు తెలుస్తూనేవుంది. మామ్మకి ఈ జీవితం మీద యింత మోజెందుకో ...జీవితప్రయాణంలో కొందరు తొందరగా పోయేరని భావిస్తాం ..కొందరు యెప్పుడొదుల్తార్రాఅనిపిస్తుంది. మామ్మ జీవితం వల్ల యెవరికి మంచి యేం సాధించడం కోసం ఇంకా ఈలోకాన్ని పట్టుకువేళ్ళాడుతోంది. మామ్మ వల్ల సాంబడు వంటావిడ తప్ప యెవరు లబ్ధిపొందుతున్నారు. ఆలోచన్లు ...మెదడ్ని తినేసే ఆలోచన్లు.
కౌముది
www.koumudi.net
ఫిబ్రవరి 2018