Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales2
అనగనగా ఓ మంచి కథ
చేతికున్న బంగారు గాజులు మెరిసిపోతుంటే తన చెయ్యి తనకే మరి మరీ చూడాలనిపిస్తోంది.
"ఆ అడ్డు కూడా ఈ రోజే తీర్చేస్తోందిటగా సుభద్ర. అందరికీ రాత్రికి పట్టు రవికెల గుడ్డలూ, వెండి కుంకుమ
భరిణలూ పంచి పెడ్తుందటగా."
దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళ కంఠ స్వరాలు సులోచన మనస్సులో గిలిగింతలు పెడ్తున్నాయి.
మనస్సులో వరుని రూపం మెదిలింది.
తల్లిలాగా పచ్చని పసిమితో, సున్నితంగా రాకుమారుడిలాగా వుండే వరుని రూపం ఆ కన్నె హృదయాన్ని
రాగరంజితం చేసింది.
"అమ్మాయ్ సులోచనా?"
చటుక్కున లేచింది సులోచన.
"అస్తమానూ అట్లా లేవకు తల్లీ. నాకు రవి ఎంతో, నువ్వూ అంతే. అత్తలో అమ్మను చూడాలి. సరేకాని బట్టలు
మార్చుకుంటావా? భోజనాలు వడ్డించేస్తున్నారు చూడు. మొహం అంతా ఎట్లా వాడిపోయిందో."
అత్తగారిని అనుసరించింది సులోచన.
మధ్యాహ్నం రవీంద్ర గదిలో సులోచనను కాసేపు పడుకోమని చెప్పి బంధువులను పంపే సన్నాహంలో
పడిపోయింది సుభద్రమ్మ.
ఎండ నెమ్మదిగా జారిపోతోంది.
వాతావరణం చల్లబడుతోంది.
సులోచన ఆలోచనలు క్రమంగా వేడిని పుంజుకుంటున్నాయి.
మెత్తటి దిండులో కన్నులు గట్టిగా మూసుకుంది.
ఏదో తెలియని ఆందోళన, లజ్జా శంకలతో కూడిన ఆనందం ఆమె మస్తిష్కమంతటా నిండిపోయింది.
ఆలోచనా జాలర్ల నుంచి తప్పించుకుంటూ చెప్పుల చప్పుడు విని చప్పున తలెత్తింది.
ఎదురుగా తెల్లటి పట్టుబట్టలలో రవీంద్ర నిలబడి వున్నారు. సులోచన తత్తరబాటుగా లేచి నిలబడింది.
రవీంద్ర ఏదో చెప్పబోయాడు.
అంతలోనే ఆ ప్రయత్నం మాని మరుక్షణం బుక్ షెల్ఫ్ లో తనకు కావాల్సిన పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆర్భాటంగా సాయంత్రం వేడుకలు మొదలయ్యాయి.
సుభద్రమ్మ ఇంట పేరంటానికి పిలవక్కరలేకుండానే విపరీతంగా పేరంటాళ్ళు వస్తారు.
కౌముది
www.koumudi.net
నవంబర్ 2023