Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesదూరారు. "ఎమైదంట్రా బుజ్జిగా” అని పొయ్యి కాడ కూర్చున్న మాయమ్మ కేకేసింది. “నేనేల్లి సూసొస్తాన్మా” అని అక్కడనుంచి సుభాషినోల్ల ఇంటివైపుకేల్తన్న.
మా ఊరికి కొత్తగా వచ్చింది సుభాషినోల్ల కుటుంబమంతా పనుల కోసం. సుభాషిణి చలాకి పిల్ల, సితనాప్పిల్ల, చదువు రాదుగాని తెలివిగల్ల పిల్ల, ఏ పనైనా చిటికెలో సేసిద్ది. ఆ పిల్ల బొరింగొట్టినట్టు కందులూర్లో ఏ మగోడు కొట్టలేడు. ఆ పిల్లతో మొగపిల్లలు కూడా పరిగెత్తలేరు. బిల్లంగోడాడిద్ది, గొలీలాటాడిద్ది, ఓకులాటాడిద్ది, గోసికట్టి ఒంగులుదూకులాడిద్ది. సన్నంగా గెడకర్రలాగా వుండి చూట్టానికి ఛామనఛాయాగుండిద్ది. లంగాబొందిలేసుకొని, రెండు జడలుండా బట్టి ఆ పిల్లని ఆడపిల్లంటారు గాని అన్ని మొగోల్ల లక్షణాలే పుష్పావతవ్వకముందు.
ఇపుడాపిల్లకి పదిహేనేళ్ళు పుష్పావతయ్యి ఆరు నెలలయ్యింది. ఇప్పుడు చూడాలి ఆ పిల్లందం ఆ చూపుల్లో సిగ్గు, బుగ్గల్లో జోబ్బల్లో నునుపు, పెదాల్లో ఎరుపు, కళ్ళల్లో కాటికే, ఎత్తుముడ్డిదాక ఎలాడే జడ, పైటలో వున్నప్పుడు కనపడే సన్నని తెల్లని పొట్ట, ఇంతెత్తు నుండే రొమ్ములు, నీళ్ళు తెస్తా బొందిలని పైకి దోపుకున్నప్పుడు కనపడే తెల్లని కాళ్ళు, అబ్బ అచ్చం సినిమాహీరోఇన్ను లాగుండిద్ది. “ఓమౌ సుభాషిణి బలేవుండిద్దె” అని ఒకసారి మా అమ్మతో అంటే “ఒరేయ్ ఆపిల్లెవురనుకున్నావ్, సుబ్బరత్తం పెద్దమ్మ కూతురుగదంట్రా నీకు సెల్లలయ్యిద్ది" అంది నేనెక్కడ తగులుకుంటానో అని. నిజానికి మా అమ్మ చెప్పేదాకా నాకు ఆ పిల్ల సెల్లెలయ్యిద్దని తెలియదు. తెలియనప్పుడు ఆ పిల్ల గురించి ఎన్నో రకాలుగా ఊహించుకున్న, మరిప్పుడు వాటినన్నిటిని ఆపుకోవాలి ఆ పిల్ల సెల్లెలు కాబట్టి. నిజంగా సుభాషిణి నాకు చెల్లెలు కాకుండా వుంటే ఎంత బాగుండేదో అని నేను ఎన్నోసార్లనుకున్న.
రెండు కాకులు ఒకటేమాయన “క్రా... క్రా... క్రా..” అని అరుస్తున్నై ఎండుతునకలారేసే కర్రమీద వాలి సుభాషినోళ్ళ ఇంటిముందు, అంతకంటే పెద్దగా “ఒమేయ్ రండమ్మే టయమవుతందా, ఒర్నాయాలో రారే సూసింది సాలుగానే, ట్రాక్టరెక్కండ్రా” అని అరుస్తన్నాడు పెద్ద నవాకు. “పాపం ఏ దొంగనాసయితి కన్నుబడిందో దుక్కలాగుండే పిల్ల ఇట్ట యాలబడతంది” అంది ఎమేలిమ్మ ట్రాక్టరు దగ్గరికి పోత కవిత్తో, “ఆమే మూడురోజులనుంచి ఆ పిల్లా మేతగ్గానే వుంది మే” అంది కవిత ట్రాక్టరు ఎక్కుతూ ఎమేలిమ్మతో, "బాలకృష్ణా ఇంకా బోనియ్” అన్నాడు ట్రాక్టర్ లో ఎక్కిం మనుషులని లెక్కేస్తూ పెద్ద నవాకు. ట్రాక్టరు గాలిబట్టిన అడవిదున్న లాగ
సుభాషిణి కాదు సుమలత
చంద్రశేఖర్ ఇండ్ల
patrika.kinige.com