Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesడాక్టర్ చెప్పిన కథలు – డా.చందు శైలజ
8
లోపలికి వచ్చేసింది.
ఉదయం ఎనిమిది అవుతుండగా స్నానం చేసి ఆకాశం రంగు షిపాన్ చీర కట్టుకుంది. ఎప్పుడూ లేనిది అతనికోసం ఎదురుచూస్తుంటే ఎప్పుడూ లేనంత టెన్షన్ అనుభవించింది. కాసేపాగిన తర్వాత చీర మరీ స్పెషల్ గా ఉందనిపించి, మామూలు డ్రెస్ వేసుకుందామనుకునేసరికి డోర్ బెల్ మోగింది.
గుండె చప్పుడు ఆమె లెక్కబెట్టుకోవచ్చన్నంతగా చెవుల్లో వినిపించింది.
తలుపు తీసి, అతన్ని లోపలికి రమ్మంది.
వేరే ఉద్దేశం తో కలవడం ఇద్దరికీ కొత్తగా ఉంది. కాఫీ తాగుతూ ఏవో ప్రొఫెషన్ కబుర్లు మాట్లాడుకుంటున్నారు. ఎంత సేపైనా విషయానికి రావడం ఇబ్బందిగా ఉందని.
“గౌతమీ..ఒక డ్రైవ్ కు వెళ్లామా?” అన్నాడు.
బయటకు వచ్చి అతనితోబాటే నడుస్తుంటే అతను చాలా పొడుగ్గా ఉన్నట్టు, తను అతనికి భుజాలవరకూ వస్తున్నట్టు గమనించింది.
కార్లో కూర్చున్నాక, ఆమె చీరచెంగు లోపలికి సర్దుకోమని చెప్పి జాగ్రత్తగా డోర్ వేశాడు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.
అతను రోడ్ వంక చూస్తూ డ్రైవ్ చేస్తూ, ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు.
“ఇప్పుడున్న జీవితం బాగానే ఉంది, ఇప్పుడు కొత్తగా పెళ్ళి అనేది ఎందుకో అర్థం కావడం లేదు.” అంది ఆమె
“తోడు కోసం. కష్ట సుఖాలు పంచుకునే తోడు కోసం.”
“దానికి ఫ్రెండ్స్ ఉన్నారుగా.”
“ అనుక్షణం మీకు మాత్రమే తోడుగా నిలిచే ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్ దొరుకుతాడు. ఊ ...ట్రస్ట్ మీ ! ఇవాళ మనిద్దరం ఎలా ఉన్నామో అలానే ఉంటాము. మిమ్మల్నెప్పుడూ మామూలు స్త్రీగా చూడను. మీనుండి ఏదీ ఆశించను. ఇద్దరం కలిసి బతుకుదాం. కలిసి ఎదుగుదాం. అంతే. పెళ్ళివల్ల మీరు భయపడే మార్పులేమీ రావని మాత్రం మాట ఇవ్వగలను. మీరు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండండి. నావైపు నుండి ఏ ఇబ్బందులూ రావనే అనుకుంటున్నాను. మీరేమైనా అడగాలనుకుంటే చెప్పండి ” అతని ఎప్పటిలా హాస్యంగా కాకుండా సీరియస్ గా మాట్లాడాడు. .
ఒక చోట కారాపాడు. అక్కడ దారికి రెండువేపులా పూలచెట్లు.
ఇద్దరూ కార్లోనే కూర్చున్నారు.
ఎంతోసేపు మౌనం తర్వాత ఆమె అంది.
“మరి నా వల్ల ఇబ్బంది వస్తే?” అడిగింది.
“ఐ కెన్ హాండిల్" అన్నాడు.
చిన్నగా నవ్వింది.
“పాప విషయంలో నీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పు.” అడిగాడు
“లేదు. లేదు. నాకు ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే స్వంతంగా పిల్లలు కావాలనుకోవడం లేదు. ప్రెగ్నన్సీల వల్ల ప్రొఫెషన్ కు దూరం కావడం నాకు మొదటినుండీ ఇష్టం లేదు.”
కౌముది
www.koumudi.net
మే 2016