Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales3
తోడొకరుండిన
ఆయన గోడ గడియారం వైపు చూసి, "హాఫ్ డే లీవ్ ఏమీ అవసరం లేదు. అప్పుడే రెండయింది. మీరు వెళ్ళ వచ్చు." పంక్చుయాలిటీ మెయిన్టైన్ చేసే పూర్ణిమ ఎంతో అవసరం వుంటే తప్ప అట్లా అడగదని ఆయనకు తెలుసు అందుకనే వెంటనే అనుమతి ఇచ్చాడు. మెట్లు దిగుతూ చేతిలో వున్న సెల్ఫోన్ తీసి డయల్ చేసింది. "తరుణీ ఎక్కడున్నావు?"
సమాధానం విని, "అయితే నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను."
....................
"నువ్వేమీ కంగారు పడవద్దు. మన కుసుమ ఆచూకీ తెలిసింది."
............
"ఆఁ. ఆ విషయమే నీతో మాట్లాడాలి. మన రేణుకను కూడా రమ్మని ఫోన్ చేస్తాను."
............
"వివరాలు వచ్చి చెప్పుతాను. ఒక అరగంటలో అక్కడ వుంటాను. బై." అంటూ మరో నంబర్ తిప్పి అదే సమాచారం చెప్పి గబగబ కిందకు దిగింది. అప్పటికే లంచ్ ముగించుకొని మాటా పలుకూ లేకుండా టీ తాగుతున్న కొలీగ్స్ ను చూసి,
"సారీ ఫ్రెండ్స్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి." అని,"రాజూ బంజారా హిల్కు ఒక ఆటో పిలుచుకొని రా" గబ గబ తన బాగ్ సర్దుకొని "బై ఫ్రెండ్స్. సీ యూ." అంటూ పరుగెట్టినట్టే వెళ్ళింది.
అప్పటికి తేరుకొన్న కొలీగ్స్కు నోరు పెగిలింది.
"అరుణా! మీరు పూర్ణిమ మాడం చాల క్లోజ్ కదా. ఈ రోజు ఆవిడ ప్రవర్తన మీకు వింతగా అనిపించటం లేదా?"
"అవును రాధికా, ఏమిటో ఆశ్చర్యంగా వున్నది. ఆ కాయితం చదివి అంత అప్సెట్ అయ్యేంత ఏముందో అర్ధం అవటల్లేదు."
"హేయ్ అరుణా ఆ పేపర్ నీ దగ్గరే వున్నదా? పూర్ణిమ తీసుకెళ్ళిపోయిందా?"
"అవును కదూ! ఆ పేపర్ నా దగ్గరే వుంది. చదువుదాము వుండండి."
అప్పటిదాకా చేతిలో నలుగుతున్న కాయితాన్ని టేబిల్ మీద పెట్టి సాఫీగా చేసి, "ఇదేదొ తెలుగు పత్రికలో ప్రచురింపబడ్డ ఒక శీర్షికలో కవిత. దాని పేరు. ‘తోడొకరుండిన అదే భాగ్యము' డేట్ వున్న భాగం చినిగి పోయి వుంది. ఈ ఆర్టికలే పూర్ణిమను అంత ప్రభావితం చేసింది."
"మీకు అభ్యంతరం లేకపోతే పెద్దగా చదవరాదూ! అందరమూ విందాము."
అరుణ చదవటం మొదలెట్టి ఆగిపోయింది. ఇది రాసిన వారి పేరు ‘పూతరేకులు' అని వుంది. ఆలోచనలో పడింది.
"పూతరేకులు! పూతరేకులు. చాలా సార్లు విన్నపదం."
"చాలసార్లు వినటం ఏంటి అరుణా, పూతరేకులు అంటే అది ఒక స్వీట్ కదా," నవ్వింది రాధిక.
"కాదు రాధికా, ఆ స్వీట్ కాదు. ఆ పదం పూర్ణిమ నోటి వెంట చాల సార్లు విన్నాను. కాని సమయానికి గుర్తు రావటల్లేదు."
"పోనీ అసలు అందులో వున్న మాటరేంటో చదవరాదా!"
WWW
తరుణి ఇంటి ముందు ఆటో దిగి హడావుడిగా లోపలికి వెళ్ళిన పూర్ణిమ అప్పటికే రేణుక కూడా వచ్చి వుండేటప్పటికి, "అమ్మయ్య వచ్చేసావా. నీకోసం ఎంత సేపు వైట్ చేయాలో అని కంగారు పడుతున్నాను," అంటూ చెమట్లు కక్కుతూ సోఫాలో చతికిల పడింది.
"పూర్ణి లంచ్ చేసావా?" చల్లటి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చిన తరుణి నెమ్మదిగా అడిగింది. "లేదే ఆ లంచ్ చేయబోయే నాకు కుసుమ సంగతి తెలిసింది."
కౌముది
www.koumudi.net
జనవరి 2016