Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesవీళ్ళిద్దరి మాటలు వింటున్నవాడు, మెల్లిగా నవ్వి, “కాసేపు ఆగితే మీరే కడతారు.” అని అనుకొని, పైకి – “చనిపోవడం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారే? మీరెప్పుడన్నా చనిపోవడానికి ప్రయత్నించారా?”
అడ్డంగా తలూపారు ఇద్దరు.
“కనీసం సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారా?”
“దానికేం భాగ్యం. సెకనుకి అరవైసార్లు!” అని ఒకడు అనగానే,
“మీకు పెళ్ళైయ్యుంటుంది!”
“వీడికి ఇప్పుడు అవ్వబోతుంది. ఆ పెళ్ళి షాపింగ్ కని వెళ్తేనే...”
మగ్గురూ కాసేపు ఫ్లాష్బాక్లోకి వెళ్ళారు -- ఉదయం పెళ్ళి షాపింగ్కని బయలుదేరాడు, పెళ్ళికాబోతున్నవాడు. కాసేపటికి పెళ్ళైపోయినవాడికి వాట్సాప్లో టెలిగ్రామ్ ఇచ్చాడు, “స్టార్ ఇమ్మీడియట్లీ” అని. వాడు వచ్చీరాగానే స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్కు తీసుకెళ్తే, మొదట సూసైడ్ కేస్ అని తేల్చారు. దబాయిస్తే, "ప్రిపరేషన్ లేకుండా ఆడవాళ్ళతో షాపింగ్కు వెళ్ళటం ప్రాణాంతకమైనది. పెళ్ళిలాంటి భారీ షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా మా దగ్గర ప్రి-షాపింగ్-ట్రీట్మెంట్స్ తీసుకుంటే మానసిక, శారీరక నష్టాలను చాలా వరకూ అదుపు చేయవచ్చు. మా ట్రీట్మెంట్స్ లో భాగంగా శరీరానికి మంచి తిండి, నీరు, వ్యాయామం అందించి భారీ బాగులు మోయడానికి మిమ్మల్ని సిద్ధపరచడమే కాక, మెడిటేషన్, యోగ నిద్ర ద్వారా షాపింగ్లో సెలక్షన్ అనే ప్రహసనాన్ని నెగ్గుకురావడమెలానో భోదిస్తాం.” అని లెక్చరిచ్చి, రెండు బాటిళ్ళ సెలైన్ ఎక్కించి, బిల్ తడిపి మోపెడు చేసి డిస్చార్జ్ చేశారు. తిరిగి మాల్ కి వెళ్ళే ఓపికలేక, ఆఫీసుకెళ్ళి ఆ దెయ్యంతో దొబ్బించుకునేంత విరక్తి రాక, సినిమాకు వెళ్లామని నిశ్చయించుకుని, బుక్మైషో.కామ్ అని కొడితే-
“అవునూ.. నేను బుక్మైషో.కామ్ అనే కొట్టా.. అది మీ సైట్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ ఎలా అయ్యింది?”
“మీరతడి ఫోనులో కొట్టుంటారు?”
“అవును. వీడి ఫోన్లోనే కొట్టా. అందుకేగా వాడి డబ్బులు దొబ్బాయ్”
“నా ఫోన్ అయితే ఏంటి?”
బుక్మెడెత్.కామ్
హైదరాబాదీ
patrika.kinige.com