Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesప్రతిపక్షాలు ఒక్కటై పావులు కదుపుతున్నాయి. అయితే వీరి ఆటలేవీ సాగబోవు. అన్ని పార్టీలు కాంగ్రెస్ తాను ముక్కలేనని స్వాతంత్ర్యం తర్వాత పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దశబ్దాలు పోరాడిన కమ్యూనిస్టులు రాహుల్ భజన చేస్తుంటే... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపి ఆ పార్టీ గూటికి చేరుతున్నాయి. దేశాన్ని రెండు ముక్కలు చేయాలని చూసే విభజన రాజకీయాలకు ఏపీ సీఎం చంద్రబాబు మద్దతివ్వడం శోచనీయం. ఎవరెన్ని కుప్పిగంతులేసినా... ప్రధాని మోదీ ముందు వారి ఆటలు సాగబోవు.
కాంగ్రెస్ అంటేనే మోసం..... కాంగ్రెస్ అంటేనే వంచన.... కాంగ్రెస్ అంటేనే
కుంభకోణాలు.... కాంగ్రెస్ అంటేనే అవకాశవాదమన్నది ప్రజా చైతన్య యాత్రలో ప్రజల
దృష్టిలోకి తీసుకెళ్లాము. తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీకొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని
చాటిచెప్పాం. ఓవైపు టీఆర్ఎస్ పార్టీని మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాల కోసం
వాడుకుంటే... ఇప్పుడు అదే స్వార్థంతో కేసీఆర్ మజ్లిస్ పార్టీని చేరదీస్తున్నారు. మైనార్టీలకు
రిజర్వేషన్ల పేరుతో టోపీ పెడుతున్నారు.
2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్రమోదీ 14 పంటలకు మద్దతు దర కల్పించి మాట నిలబెట్టుకున్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైతంగానికి మంచి ఊరట లభించినట్లయింది. దీంతో వ్యవసాయం దండగ కాదు.. వ్యవసాయం అంటే పండుగ అని చాటి చెప్పారు. అందిరికి అన్నంపెట్టే అన్నదాతలు కష్టాలు అర్ధం చేసుకున్న మోదీ.. రైతన్నలు పండించిన పంటలకు మద్దతు ధర పెంచి అన్నదాతలకు ఆప ద్భాంధవుడయ్యారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం రైతుల ఆత్మహత్యలను నివారించడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు.
నాలుగేళ్ల మోదీ పాలనలో దేశం అన్ని విధాలా అభివృద్ధి సాధించింది. ప్రపంచ యవనికపై భారత కీర్తి పతాక రెపరెపలాడిన విషయాన్ని గుర్తించాలి. బిజెపి పాలనలో రాష్ట్రాలు అభివృద్ధికి