Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ఇద్దరం కాదు ఒక్కరం...

“ఇద్దరు ఒకరవ్వడం ఎలా సాధ్యం?” సూటిగా అడిగేసింది మా చెల్లెలు.

“అదే కదా పెళ్ళి మహత్యం.. అందులోనూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళం” నవ్వుతూ చెప్పాన్నేను.

“అది కాదే, మరి నేను దీపు కూడా ప్రేమించే పెళ్ళి చేసుకున్నాంగా.. మరి ఈ గొడవలెందుకొస్తున్నట్టు?” అమాయకంగా అడిగిందది.

“ప్రేమించుకుంటే గొడవ పడకూడదని ఏమైనా ఉందా, లేదా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళ మధ్య అసలు గొడవలే రావని ఎవరైనా చెప్పారా?” నవ్వుతూ అన్నాన్నేను.

“అంటే నువ్వు బావ కూడా గొడవ పడతారా?”

ఆ ప్రశ్నకి సారి ఆశ్చర్యపోవడం నా వంతైంది.

“మరి అందరు మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారని, బావకి నువ్వంటే ఏంతో ప్రేమని
అంటారే!!”

“అది అక్షరాలా నిజం” మనస్ఫూర్తిగా చెప్పానామాట.

“అసలేంటో నాకేమర్థం కావడం లేదక్కా.. కొంచెం మీ ప్రేమ గురించి మీరు దాన్ని గెలుచుకున్న తీరు గురించి చెప్పవా ప్లీస్” బతిమాలుతూ అడిగింది కొత్త పెళ్ళి కూతురు.

“తప్పకుండా చెప్తానురా. రుతువుల్లాగే ప్రేమలోనూ మార్పులు జరుగుతూ ఉంటాయి. మీ బావ నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణ స్నేహితులం. ఆ స్నేహం ప్రేమగా మారడానికి పెద్దగా కష్టపడాల్సి రాలేదు కానీ, ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి, దాన్ని పెళ్ళిదాకా తీసుకురావడానికి మాత్రం చాలా కష్టపడాల్సొచ్చింది. ఇక జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటి సంవత్సరం ఎంత మధురంగా గడిచిందో చెప్పలేను. ఒకరు మనల్నే లోకంగా చేసుకుని బతుకుతున్నారనే భావనే చాలా గొప్పది శ్రీ.

“కాని అంత ఆనందంలోనూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉండేది, మేము ఇలా కలిసి బ్రతకాలని తీసుకున్న నిర్ణయం సరైందేనా అని!! దానికి మీ బావ గారి ప్రేమే సమాధానమైంది. ఆ రాముడైనా సీతను వదిలిపెట్టగలిగాడేమో కాని తను మాత్రం మాట వరసకైనా నా చేతిని విడిచిపెడతాను

ఇద్దరం కాదు ఒక్కరం...

బి. నాగ పావని