Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

2

స్వాతి వాన కోసం

ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయిందని కూతురు వచ్చి చెప్పడంతో అక్కగారిని చూసేందుకు హరిప్రసాద్ భార్యని తీసుకొని వెళ్లాడు.

పూర్వంలా నిరాశగా మాట్లాడకుండా ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్న జానకిని చూడడంతోనే అతడు ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాడు.

" హారిక చెప్తే ఏమో అనుకున్నాను గానీ అక్కా నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు. మొత్తం మీద శశిగాడు నీలో చాలా మార్పు తీసుకువచ్చాడు సుమి! " అన్నాడు ఆనందంగా.

" నిజమేరా ... వాడిని చూశాక కొండంత ధైర్యం వచ్చినట్లనిపించింది నాకు. చిన్నవాడైనా వాడి మాటల్లో ఎంత మెచ్యూరిటీ ఉందనుకున్నావు? " అంది జానకి చిన్న కొడుకుని తలచుకొని మురిసిపోతూ.

" నీకు వాడి మీద గల మమకారం అక్కా అదంతా. నీ చుట్టూ ఇంతమందిమి అనుక్షణం నిన్ను కనిపెట్టుకుని ఉన్నా రాని ధైర్యం వాడిని చూస్తే వచ్చిందా? నీ మీద బెంగతో చిక్కి సగమైనాడు రవి. ఎపుడైనా గమనించావా వాడిని? పాపం ఆ సుగుణ వయసులో చిన్నదైనా కన్నతల్లిలా నిన్ను చూస్తోంది. పిచ్చిపిల్ల రమ్య నీకు జబ్బు చేసిన దగ్గర నుండి ఎలా ఢీలా పడిపోయిందో చూశావా అనలు? " అన్నాడు హరిప్రసాద్ మందలిస్తున్నట్లుగా,

" అవునురా . రవిని చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నట్లున్నాడు వాడు. సుగుణ సంగతి సరేసరి. బంగారు తల్లి, ఎంతో ఓపిగ్గా నా మంచి చెడ్డలన్నీ చూస్తోంది. ఇంక రమ్య నిన్న దాని ఏడుపు చూస్తే నాకు మతిపోయిందనుకో! వీళ్లందర్నీ ఏం చేసి పోతావు? అంటూ శశి నన్ను నిలేసేసరికి నానోట మాట రాలేదనుకో" అంది జానకి సజల నయనాలతో.

" పోన్లే అక్కా, ఇప్పటికైనా నీ మనసు తెలుసుకున్నావు అంతేచాలు" అన్నాడు హరిప్రసాద్ ఆప్యాయంగా జానకి చెయ్యి పట్టుకొని,

" అది సరేగానీ, హారిక ఏమంటోందిరా శశిని గూర్చి? " అనడిగింది జానకి ఆశగా తమ్ముడి వంక చూస్తూ.

" ఇప్పుడీ ఆలోచనలన్నీ ఎందుకక్కా నీకు? ఏ వత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో. ముందీ గండం నుండి బయటపడ్డాక మిగతా విషయాల గూర్చి ఆలోచిద్దాము " అన్నాడు హరిప్రసాద్ అనునయంగా,

" అవును వదినా, ఆయన చెప్పినట్లు మనసు ప్రశాంతంగా ఉంచుకో. అన్నీ అయ్యాక నిదానంగా మాట్లాడుకుందాం ఇవన్నీ! మీ తమ్ముడికి నిద్రలోనూ, మెలకువ లోనూ నీ ధ్యాసే! ఇదిగో ఇవేళ నిన్ను చూశాక

కౌముది

www.koumudi.net

జనవరి 2022