Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

2

Office Of The Advisor (communications)
Government of Govt. Of Andhra PradeshGOVERNMENT OF ANDHRA PRADESH
సత్యమేవ జయతే

అధికారులతో చర్చించారు. సత్వర ఫలితాలు సాధించేలా దశలవారీగా గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తి చేయాలని, కాలువల నిర్మాణ వ్యయం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా మొదటి దశ కింద ప్రస్తుతం వున్న కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వీలైనంత వేగంగా ఎంతమేర జలాలను తరలించవచ్చో అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ సంగమం సంపూర్ణమైతే రాష్ట్రంలో సుమారు 1,500 టీఎంసీల వరకు జలాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.

ఈనెల 23న రాష్ట్రానికి గడ్కరీ

పోలవరం పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈనెల 23న రాష్ట్రానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో గోదావరి-పెన్నా అనుసంధానంపై సవివర ప్రాజెక్టును రూపొందించాలని ముఖ్యమంత్రి ‘వాప్ కాస్’ ప్రతినిధులకు సూచించారు. గోదావరి-పెన్నా అనుసంధానంతో పాటు కావేరి వరకు గోదావరి జలాలను తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ వివరాలతో గడ్కరీకి ప్రజంటేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

కృష్ణానదిపై మరో బ్యారేజ్

పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువన, ప్రకాశం బ్యారేజ్కు 23 కి.మీ ఎగువన కొత్తగా బ్యారేజ్ నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వైకుంఠపురం దగ్గర కృష్ణా నదిపై నిర్మించే ఈ బ్యారేజ్కు రూ. 3,278.60 కోట్లు వ్యయం కానుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుందని వెల్లడించారు.

జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.