Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

సంతోషపెట్టడం అనే నిర్బంధనలోనే ఉంటావు. కాని నీవు యేసును వెంబడించడం కొన్నిసార్లు ఇతరులకు సంతోషం కలుగజేయదు. దానికి బదులుగా వారికి నిరాశ కలుగుతుంది.

చాలామంది అభిప్రాయంలో, ఈ రెండు, మరికొన్ని ఉదాహరణలు (గుర్తింపు, సంపద, హోదా) కూడా వారిని నడిపించేవిగా వుంటాయి. ఇది ఎలా మొదలవుతుంది అంటే 1. నేను ఫలానా పనులు సాధించాలి, ఎందుకంటే అందులోనే నా గుర్తింపు ఉంది. 2. కనుక నా గుర్తింపు, నేను ఏమి సాధించాను అనే దానిపై ఆధారపడి ఉంది (అది నాకు ఒక అర్ధాన్ని, ఉద్దేశ్యాన్ని, విలువను కలిగిస్తుంది) 3. కనుక అంగీకారం, ప్రాముఖ్యతల, అవసరం పెరిగే కొద్దీ, నేను సాధించాల్సినవి పెరుగుతూ ఉంటాయి. 4. కాని అవి కేవలం ఎల్లప్పుడూ తాత్కాలికమైనవి మరియు బలహీనమైనవి. ఎక్కడైనా ఒక చోట పొరబాటు జరిగినప్పుడు, అంతరంగంలో నిరుత్సాహం మరియు అణగారిన స్థితి పొంది, దాని పర్యావసానంగా, తిరిగి మొదటికే చేరతాను. యేసుప్రభువు కాకుండా ఏది నీ అంతరంగంలో నిన్ను నడిపిస్తుందో ఆ అంశమే లేక వస్తువే నీ విగ్రహం. ఇదే మూల సమస్య.

నీ హృదయంలోని విగ్రహాలను పరిశీలించుట: ప్రతి ఒక్కరికి వారి హృదయ లోతుల్లో ఎన్నో మరుగైన విగ్రహాలు వుంటాయి. వాటిని గురించి పశ్చాతాపం పొంది వెళ్ళగొట్టడం చాల అవసరం. విగ్రహాలు ఉన్న స్థలంలో యేసు ప్రభువును ప్రతిష్ట చేయాలి. అపోస్తులుడైన పౌలు వ్రాస్తూ "కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి." రోమీయులకు 12:1-2

ప్రతీ క్రైస్తవుని ఆలోచనా విధానం ప్రకారం, యేసు ప్రభువులో నీవు అంగీకరింపబడ్డావు మరియు ప్రేమింపబడ్డావు అనే వాస్తవాన్ని గ్రహించడమే నీకు నిజమైన పరివర్తనను తెస్తుంది. నీకు నీవు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి దేవుని అంగీకారాన్ని నీవు సంపాదించలేవు లేక పొందుటకు నీకు అర్హతలేదు. నీ హృదయంలోని విగ్రహాలను గుర్తుపట్టి, వాటినుండి (పశ్చాతాపంతో) వెనుదిరిగి, క్రీస్తునందు విశ్వాసం వుంచడం ద్వారానే, నీ నిజమైన గుర్తింపును (నీ అర్ధం, ఉద్దేశ్యం, విలువ) స్వీకరించగలవు. అంతేకాకుండా, దేవుడు ఒక ప్రత్యేకమైన మరియు అపూర్వమైన విధానాల ద్వారా (అందరి క్రైస్తవులకు సంబంధించిన సాధారణమైన మార్గాల ద్వారా కూడా) ఆయన్ని సేవించుటకు నిన్ను పిలుచుకుంటాడు.

తన పిలుపును నీ జీవితంలో నెరవేర్చుటకు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు కూడా. మొట్టమొదట దేవుడు నిన్ను రక్షించి, నీ ఆకారం (SHAPE ) కోసం కావాల్సినవి అందజేస్తూ, ఆయన్ని సేవించుటకు నడిపిస్తాడు. దీని ద్వారా నీ గుర్తింపు గురించిన భావన నీలో లోతుగా పెరుగుతూ వుంటుంది (నీ అర్ధం, ఉద్దేశ్యం, విలువ) 'ఇది దేవుని వరమే, గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.' (ఎఫెసీయులకు 2:8-10). కనుక నీ జీవితంలో ఆయన యొక్క అద్భుతమైన కృపనుబట్టి, ఆయన యెడల ప్రేమ గలిగి, విధేయతతో, నీ జీవితం ద్వారా దేవుణ్ణి సేవిస్తావు. ప్రతి క్రైస్తవుడు ఈ విధంగా ఉండాలి, గాని చాలామంది దీనికి వ్యతిరేకమైన తప్పుడు విధానంలో మొదలుబెడతారు.