Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesదైవ దర్శనం లో దేవుడు, మనుష్యజాతికి ఆయన ఉద్దేశ్యాలు, చిత్తం ఉంటాయి. పేతురుకు ఇవ్వబడిన దర్శనంలో ఆ పెద్ద దుప్పటి, సంఘమై ఉన్నది. అందులో అన్ని రకాల మనుష్యులు కూడుకుంటారు, వారు ఏ దేశం, జాతి లేక భాష వారైనప్పటికీ. యూదుల నమ్మిక కోణం నుంచి చూస్తే, ఇందులో 'అపవిత్రం' గా పరిగణించబడ్డ ఆహారాన్ని తిన్న అన్యులు కూడా ఉన్నారు. దీని గురించి యేసు తన బోధలో ఈ విధంగా చెప్పారు "వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను." (మార్కు 7:15,16). 1 తిమోతి 2:4 లో చెప్పిన ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేవు 'ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు'. దేవుడిచ్చిన దర్శనంలో దేవునివాక్యం తో ఏకీభవించే దేవుని సారాంశం ఉంటుంది.
3. దర్శనం అనేది దేవుడిచ్చిన అవకాశాలను గట్టిగా పట్టుకుంటుంది.
పేతురుకు దర్శనం కలుగటం, వెంటనే కోర్నేలి ద్వారా అన్యులు పేతురు గృహానికి పంపబడటం, ఈ రెండు సరిగ్గా ఒకేసారి సంభవిన్చేలాగా దేవుడు సమకాలీకరించారు. ఇప్పుడు పేతురు కేవలం దేవుడు చెప్పినదానికి లోబడటం ఒక్కటే అవసరమై ఉన్నది. చెప్పాలంటే తరువాత సందర్భంలో పేతురు ఈ విధంగా చెప్పెను "కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక.." అపొ. కార్యములు 26:19. కనుక దేవుడు 1 కొరింథీయులకు 2:9-10 లో చెప్పినట్టుగా అద్భుతమైన విధానాలలో పనిచేస్తారు "ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.". కనుక దేవుడు అనుగ్రహించే అవకాశాల కోసం చూడాలి. అవి నిన్ను ముందు ఆశ్చర్యపరుస్తాయి, కాని అవి దేవునిచే నీకు తెరువబడిన అవకాశాలు. దేవుని మార్గాలు ఇలా ఉంటాయి.
దాదాపుగా ఇలా ఉంటాయి.
4. దైవదర్శనం దేవునికి మహిమ తీసుకొస్తుంది (అపొ. కార్యములు 11:15-18)
దైవదర్శనం ద్వారా దేవుడు పేతురుకు స్పూర్తిని కలుగజేశారు. పేతురు విధేయత చూపడం వలన, అది అన్యులు దేవుణ్ణి తెలుసుకొని రక్షింపబడటానికి ద్వారాన్ని తెరిచింది, తద్వారా ఆ దర్శన నెరవేర్పు దేవునికి మహిమ తీసుకొచ్చింది. 'వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి.' (అపొ. కార్యములు 11:18). కీర్తనలు 115:1 లో ఈ విధంగా చదువుతాము 'మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక'. ఇంకా ముందు పేతురు ఎలా దేవుడిచ్చిన దర్శనాన్ని సొంతం చేసుకొని, ఎలా సువార్త అనేది సంస్కృతి, సాంప్రదాయ ఆటంకాలను దాటేసింది అనేది పరిశుద్ధ గ్రంధంలో చూద్దాం. అపొ. కార్యములు