Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to SalesVisit of Stephen E. Biegun, Deputy Secretary of State of the United States of America (October 12-14, 2020)
October 13, 2020
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ శాఖ
సహాయ మంత్రి స్టీఫన్ ఇ. బీగన్ పర్యటన (అక్టోబర్
12-14, 2020)
అక్టోబర్ 13, 2020
యూఎస్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి స్టీఫన్ బీగన్ 12-14 అక్టోబర్
2020 తేదీలలో న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటన సందర్భంగా, ఆయన 13 అక్టోబర్ 2020న విదేశాంగ కార్యదర్శి
శ్రీ హర్ష్ వర్ధన్ శృంగ్లాతో చర్చలు జరిపారు. రాజకీయ, భద్రత మరియు
రక్షణ, ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక మరియు ప్రజా సంబంధాలు సహా భారత్-
యూఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద జరుగుతున్న
అన్ని స్థాయిల సమావేశాలలోనూ వారు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలు
కలిగిన అనేక ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాలపై వారు అభిప్రాయాలను
పంచుకున్నారు. మరో ముఖ్యంగా 2021-22 కాలవ్యవధికి ఐక్యరాజ్యసమితి
భద్రతా మండలిలో భారత్ సభ్యత్వం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో
సహకారాన్ని పటిష్ఠం చేసుకోవడానికి గల మార్గాలపై వారు చర్చించారు.
ఈ పర్యటన సందర్భంగా, విదేశ వ్యవహారాల శాఖ మంత్రి మరియు జాతీయ
భద్రత సలహాదారును కూడా యూఎస్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి
కలుసుకున్నారు. అలాగే ప్రస్తుత ద్వైపాక్షిక సహకారంపై చర్చించడంతో
పాటు ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్-యూఎస్ వర్చువల్ ఫోరమ్ ప్రారంభ సెషన్, టెక్ 1.5
చర్చలలో యూఎస్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మరియు విదేశాంగ
కార్యదర్శి పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో భారత్-
యూఎస్ మధ్య ప్రస్తుత సహకారం అలాగే ద్వైపాక్షిక బంధాన్ని
బలోపేతం చేసుకోవడం, బహుళపక్ష వేదికల్లో సహకారం గురించి వారు
మాట్లాడారు.