Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales6
ఒక కొత్త దృక్పథాన్ని సాహితీలోకానికి పరిచయం చేయడం, భవిష్యద్దర్శనాన్ని
గురించి సాహితీ వేత్తల భిన్న అభివ్యక్తులు ఈ పరిశోధన పరమార్థం. ఉదాహరణకు
శ్రీశ్రీ దృక్పథంలో ఇంకో ప్రపంచం ఉంది. అది భావి ప్రపంచం. ఎక్కడ కవిత్వం
రసవంతంగా, సరికొత్తగా ఉంటుందో, ఎక్కడ సూర్యకాంతులు రంగురంగుల్లో
తేలిపోతాయో, ఎప్పుడు తన ఆలోచనలకు రెక్కలు వచ్చి ఆకాశ గంగాతీరంలో
విహరిస్తాయో అదంతా భవిష్యత్తంటారు. భావి వికాస వాటికల బాటలలో పోతూ
అటువంటి కవితా ప్రపంచం కావాలంటాడు.
‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని ఒకరంటె, ‘భావి యెఱిగి సెప్ప
బ్రహ్మతరము గాదు’ అని మరొకరన్నారు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అన్నట్లుగా
కాలాన్ని గురించి కవులకు భిన్న దృక్పథాలున్నాయి. గత కాలానికి ప్రాధాన్యమిచ్చే
సంప్రదాయ వాదులు, వర్తమానమే ప్రధానమనేవారు, భవిష్యత్తును దర్శించేవారు, మూడు
కాలాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేవారు, వర్తమానంలోనే భవిష్యత్తు ఉందనేవారు, భవిష్యత్తు
లోనే అంతా ఉందనేవారు... ఈ విధంగా అనేక కోణాలు తెలుగు కవిత్వంలో ప్రదర్శిత
మవుతాయి.
ఈ కోణంలో సమీక్షించి చూసినట్లయితే మూడు కాలాలకు సమప్రాధాన్యం ఇచ్చే
వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. భావకవులు, అభ్యుదయ కవులు, విప్లవ కవులు,
చేతనావర్త కవులు, అనుభూతి కవులు, దళిత కవులు, మైనార్టీ కవులు, ప్రాంతీయ
కవులు అధికంగా ఏదో ఒక్క దృక్పథంతోనే అధికంగా మొగ్గు చూపే వారిగా కనిపిస్తారు.
గతాన్ని ఖండిస్తే అందరూ ఏకదృష్టితో, ఏకదృక్పథంతో విమర్శించడం కనిపిస్తుంది.
ప్రతి ధోరణిలోను భిన్నత్వాన్ని గమనించవచ్చు.
స్వాప్నిక జగత్తులో భవిష్యత్తును దర్శించి అది సత్యమో, భ్రాంతియో, స్వప్నమో,
ఇంద్రజాలమో అంటారు భావకవులు. అజ్ఞాత భావికాలపు యుగాల వరకు తమ కవిత్వం