Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
గోపాలం:- రామయ్య! రేపు పంచాయితీ భవనం దగ్గర కలుద్దాం, మీ అమ్మాయి సవితను కూడా తీసుకొనిరా.
సవిత నీటి సంరక్షణ విషయంలో చాలా సునిశితంగా ఆలోచిస్తూ నీటిని పొదుపుగావాడుకోవాలని చెపుతూ
వుటుంది., నీరు వృధాగా పోతూ వుంటే ఆపిల్ల చూసి తట్టు కోలేదు. .
రామయ్య:- సరే గోపాలం అన్నా! రేపు నేనూ సవితా కలిసి వస్తాం
.................... నీటి మిల్లు, నదీ ప్రవాహపు చప్పుళ్లు క్రమ క్రమంగా తగ్గుతూ ఆగిపోతాయి....................
.................... దృశ్యం :-- పంచాయితీ భవనం. సదస్సు వాతావరణం ....................
.................... మైక్ సరిచేస్తున్న చపుళ్లు, ఆహుతుల సందడిని తెలియచేసే చప్పుళ్లు .......
గోపాలం:- అందరూ సర్దుకొని నిశబ్దం గా కూర్చోం డి
.................... నిశబ్ధం ....................
గోపాలం:- మిత్రులారా! పంచాయితీ భవనం లో జరుగుతున్న ఈ సభకి ఆహ్వానం. మన బి.డి.వొ. శ్రీమతి రేఖ
గారు మన పుర విభాగాన్ని అన్ని విధాలా వెలుగొందేలా చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మన గ్రామ ప్రజల
తరఫున వారిని వేదికమీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆహుతులతో సభ నిం డుగావుంది. శ్రద్ధగా, ఆసక్తిగా
ఇక్కడకు వచ్చిన మీ అందరికి మరొక్కసారి ఆహ్వానం.
.................... తప్పట్లు ....................
రేఖ: - - గోపాలంగారికి, సభాసదులకు నమస్కారం . నీటి సంరక్షణ విషయమై మీతో సంభాషించడానికి
మిమ్మల్ని అందరినీ ఇక్కడకు ఆహ్వానించాము. అందువల్ల నేను ఉపన్యసించడం, మీరు వింటూ కూర్చోవడం ఈ
సభ ఉద్దేశ్యంకాదు ఏమంటారు గోపాలంగారూ, అంతేనా?
గోపాలం:- మిత్రులారా, మన బి.డి.వొ. శ్రీమతి రేఖ గారు చాలా సహృదయులు. మనకి సహకారాన్ని
అందించడానికి వచ్చారు. గతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలలో మనకు వారి అమూల్య దిశానిర్దేశంతో
సహకరించారు.కాబట్టి వారితో ఏ సంకోచం లేంకుడా మీమీ సందేహాలను తీర్చుకోవచ్చు.
.................... తప్పట్లు ....................
రేఖ:- అత్యంత ప్రాముఖ్యత గల ఈ విషయంపై మీతో చర్చించడానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా
సంతోషంగావుంది. దాదాపుగా మన విభాగంలోని అన్ని గ్రామాల నుండి గ్రామీణులు ఈ సభలో పాల్గొనడానికి తరలి
6