Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

గంధపు దండ

“హేయ్ డాడ్!”

ఇంట్లోకి అడుగుపెట్టగానే పలకరించాడు చిన్నోడు. ఓ కంటితో టీవీ చూస్తూనే మరో
కంటితో పలకరించడం వాడి ప్రత్యేకత. వాడి కళ్ళలో ఓ క్షణం మెరిసి మాయమయ్యే ఆ మెరుపు
ల్యూమినాన్సులో ఈసారి కూడా ఏమాత్రం తేడా లేదు. ప్రేమను కొలవడానికి ఏ పరికరాలు,
కొలమానాలు లేవు కానీ సరిగ్గా అలాంటి మెరుపే చిన్నప్పుడు రోజూ పని నుంచి తిరిగొచ్చిన మా
నాన్నను చూసినప్పుడల్లా నా కళ్ళలోనూ మెరిసేది. ఆ మెరుపును ఇట్టే పోల్చుకోగలను.

“హేయ్ చిన్నా, వాట్స్ అప్, హౌ వాస్ యువర్ డే ఎట్ స్కూల్?” సోఫాలో కూలబడి షూస్
విప్పుకుంటూ పలకరించాను. వాడినుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి-

“చిన్నా, మన మధ్య ఈ టివీ అడ్డంగా ఉందిరా!” అన్నాను.

నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాకపోయినా టీవి ఆఫ్ చేసి, "లవ్ యూ డాడ్” అంటూ ఓ
హగ్ ఇచ్చి నా పక్కన కూర్చున్నాడు.

ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్న. కానీ మా చిన్నోడొచ్చి నాన్నను
రెండవ స్థానంలోకి తోసేసాడు. వాడికిప్పుడు పదేళ్ళు. అందమైన కళ్ళు, కళ్లపై వాలిన సిల్క్ లాంటి
పొడుగాటి జుట్టు. బొద్దుగా అందంగా ఉంటాడు.

లవ్ యూ అని రోజుకు పదిసార్లు అలా అలవోకగా అనేస్తాడు వాడు. నేనావయసులో మా
నాన్నని “లవ్ యూ డాడ్" అని అనే సాహాసం ఎప్పుడూ చేయలేదు. ప్రేమ లేక కాదు. ప్రేమని ఎక్స్
ప్రెస్ చేయలేని సిగ్గుతో.

“రేయ్ చిన్నా, డూ యు రియల్లీ లవ్ మీ?” వాడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ టీజ్
చేయాలనిపించి అడిగాను.

“ఓ యా, సో మచ్ డాడ్” పెదాలతో పాటు ‘సో...'ని సాగదీస్తూ అన్నాడు.

“అయితే నేను పోయాక నన్ను మిస్ అవుతావా?” చిలిపిగా అనాలనుకున్నా గొంతులో జీర
అడ్డు వచ్చింది.

“వా డ్డూ యూ మీన్”

గంధపు దండ

52 రవి వీరెల్లి

patrika.kinige.com