Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales“బహుశా అది కూడా ఒక కారణం కావచ్చును.”
“సరే మరి,” అన్నాడతను, “ఏం చేద్దాం ఇప్పుడు? అంట్ల పని కానిచ్చేద్దామా?”
ఇద్దరూ పాత్రల్ని శుభ్రంగా తోమి ప్రత్యేకమైన శ్రద్ధతో వాటిని ఒక పక్కన పేర్చారు.
ఎనిమిదిన్నరకి పిల్లలు ఇద్దర్నీ పడుకోబెట్టారు. నిద్రపోయిన వారి చెంపల్ని ముద్దాడి, తలుపు జారేసి,
బయటకు నడిచారు.
అతను మధ్యలో ఆగి వెనక్కు చూశాడు.
“ఏం?”
“తలుపు పూర్తిగా ముసేద్దామా, లేక పిల్లలు పిలిస్తే వినపడేట్టు కొంచెం తెరిచి
ఉంచుదామా.”
“అసలు వాళ్లకి తెలుసా – ఎవరన్నా చెప్పి వుంటారంటావా?”
“తెలిసివుండదు. లేదంటే అడుగుతారుగా.”
తర్వాత ఇద్దరూ కూర్చుని కాసేపు పేపర్లు చదివారు, మాట్లాడుకున్నారు, పాటలు విన్నారు.
చివరికి నిశ్శబ్దంగా కూర్చుని గడియారం పదిన్నర దాటే దాకా పదకొండు దాటే దాకా
పదకొండున్నర దాటే దాకా ఎదురు చూసారు. ప్రపంచంలో మిగతా జనమంతా ఈ రాత్రికి తమకే
ప్రత్యేకమైన రీతుల్లో ఎలా గడిపివుంటారో ఊహించారు.
“హ్మ్,” నిట్టూర్చి లేచాడు చివరికి. భార్యని దగ్గరకు తీసుకుని చాలాసేపు
ముద్దుపెట్టుకున్నాడు.
“మనం ఒకరి పట్ల ఒకరం బాగున్నాం కదూ.”
“ఏడుపొస్తోందా?” అడిగాడు.
“లేదు.”
ఒకసారి ఇల్లంతా తిరిగి లైట్లు ఆర్పేశారు, తలుపులు మూసేశారు, పడకగదిలోకి వెళ్ళి చల్లని
రాత్రి చీకటిలో దుస్తులు మార్చుకున్నారు. ఆమె దుప్పటి సవరించింది. “దుప్పటి ఎంత చల్లగా
శుభ్రంగా బాగుందో,” అందామె.
“నేను బాగా అలిసిపోయాను.”
ప్రపంచానికి ఆఖరు రాత్రి
రే బ్రాడ్బరి
patrika.kinige.com