Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

2

జాలిలేని జాబిలి - కొమ్మూరి వేణుగోపాలరావు

మనకి కనిపించకుండా చాలామంది వుంటూనే ఉన్నారు. ఎలాగో కదిలించబడి సన్నిహితముగా వస్తూనే వున్నారు. అదే ఆశ్చర్యం."

శైలజ నిట్టూర్చి "నేనూ నీకు సిన్సియర్ ఫ్యాన్నే. అబ్బ! ఆ పుస్తకాలు ఎలా కదిలించాయి నన్ను" అంది.

అతను చకితుడయినాడు. ఓ క్షణం వూరుకుని "కాని అవి నేను తప్ప ఇంకెవయినా రాసి వుంటే మీరు ఉత్తరం రాసివుండేవాళ్ళు కాదు. నేను పరిచయస్థుడ్ని కావడం చేత మీ మనస్సు, పొజిషన్ అభ్యంతరం చెప్పలేకపోయినై" అన్నాడు.

శైలజ ఆశ్చర్యంగా "నిజమే. అలాంటి అహంభావం నాకు ఉంది" అని ఒప్పుకుంది.

***

ఆ రాత్రి భోజనాలు అయినాక తనకోసం ఏర్పాటు చేసిన గదిలోకి పోతుండగా ప్రక్కన ఓ బల్లమీద సితార్ కనిపించింది. దానిమీద అతను ఈ మధ్య సాధనం చేశాడు. ఒక వాద్యం బాగా వచ్చినవాడికి మిగతా తేలిగ్గా అలవాటు పడిపోతాయి. అనుకోకుండా తలలో ఓ సంపర్కం తెలుస్తూ వుంటుంది. అతనికి సితార్ మీద వాయించటం బాగానే వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు.

ఈ మధ్య విడుదల అయిన సినిమాలో శైలజ పాడిన పాటే వాయించసాగాడు సోఫాలో కూర్చుని.

శైలజ తన గదిలోంచి బయటకు వస్తూ యీ మధుర మంజులగానం ఆలకించింది. నెమ్మదిగా, చప్పుడు చేయకుండా వెళ్ళి గుమ్మం ఇవతల నిలబడింది.

కొన్ని నిముషాలైనాక పాట ముగిసింది.

మధుబాబుకు ఏదో అనుమానం తోచి, ఆమెని చూసి లజ్జితుడయి "మీరా? ఎంతసేపయింది వచ్చి? వొట్టి పిచ్చి నాకు" అన్నాడు.

శైలజ లోపలకు వచ్చి మరో కుర్చీలో కూర్చుని "నీకు రాని విద్య అంటూ లేదా చినబాబూ? ఏదో మరొకటి వాయించు, చాలా ఆసక్తిగా వుంది" అని అడిగింది ఎంతో కుతూహలంగా.

"క్షమించాలి .ఇవి నా ఆనందం కోసం నేను నేర్చుకున్నవి. ఎందుకూ పనికిరానివి. గట్టిగా ఎవరయినా అడిగితే చెయ్యి కదలదు."

"బ్రతిమాలినా అంతేనా?"

కౌముది

www.koumudi.net

తే 2024