Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ఈ కథలకున్న విశేష గుణం క్లుప్తత! అతి తక్కువ పదాలలో అందమైన భావాలను కూర్చి అల్లిన అనుభూతుల మాలలు ఈ కథలు. ఈ సంపుటంలోని కొన్ని కథల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.

కృష్ణానది చుట్టూ ఉండే పచ్చదనాన్ని, ప్రకృతినీ వర్ణించిన తీరు అబ్బురపరుస్తుంది. అద్భుతమైన భావుకత్వం పొంగిన కథ “రెండు గంగలు”. ఈ కథలో.. ముఖ్యంగా కృష్ణానదిపై వర్షం కురిసే సంఘటన చదివితీరాలి. ఈ కథ చదువుతుంటే.. పాఠకులకి కుందుర్తి వారి “నగరంలో వాన” గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు.

“నాన్న – నది”, “తల్లి కడుపు చల్లగా...”, “అంపకం” కథలు తల్లి ప్రేమని, తండ్రి ఆపేక్షని వ్యక్తం చేస్తాయి.

శ్రద్ధ, భక్తిభావంతో చేసే పనుల వల్ల కలిగే పులకింత, తన్మయత్వం – అభావంగా చేసే చర్యలవల్ల కలగవని తెలిపే కథలు – “మనసు నిండుకుంది”, “సాక్షాత్కారం”. యద్భావం తద్భవతి అని చాటే కథలివి.

ప్రస్తుత కాలంలో – విడిపోయిన కుటుంబాలను కలిపేది, సత్యాన్ని నిలబెట్టేది ఏ రామాయణమో అని వాపోతారు రచయిత – “సీతారామాభ్యం నమః” కథలో.

“ఏడాదికోరోజు పులి”, “పూలసుల్తాన్”, “మట్టి... ఒట్టి మట్టి కథ” చదివి తీరాల్సిన కథలు.

ఈ కథలన్నీ కాలానుగుణంగా ఉంటాయి. కాలక్రమేణా మనుషులలో వస్తున్న మార్పులకు అద్దం పడతాయి. మనుషులలోని ఔన్నత్యం – ఊరుమ్మడి మేలుకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం నుండి తన స్వీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే స్థాయికి దిగజారడం కళ్ళకు కడుతుంది. “అంతా బాగానే వుంది...” కథ ఈ పరిణామాలపై చక్కని వ్యాఖ్యానం!

కథలన్నీ ఒక ఒడుపుతో నడిపిన తీరు ఒక ఎత్తైతే, – మనుషుల స్వభావాలను, కాలానుగుణంగా వస్తున్న మార్పులను కళ్ళకు కట్టిన కథ “భోజనాంతే..” మరొక ఎత్తు.

ఈ కథలలో దేవుడుంటాడు, రాజులుంటారు, అర్చకులుంటారు, పురోహితులుంటారు. అంతేకాదు, భూస్వాములు, రైతులు, పాలికాపులు, పూలసుల్తాన్, బావగాడు, శంకరయ్య, శంభులింగం, పోస్ట్ మాస్టర్.. ఇలాంటి వారందరూ వ్యక్తులుగా పాఠకుల కళ్ళముందు కదలాడి పాత్రులుగా ఒదిగిపోతారు. ఆహ్లాదం పంచుతారు, 'ఆహా!' అనిపించుకుంటారు.

‘అమరావతి కథలు’ సమీక్ష

కొల్లూరి సోమశంకర్

patrika.kinige.com