Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesనాటవలసిన మొక్కలు :
పంచ మహా వృక్షాలు
: 1. జమ్మి 2. మారేడు 3. రావి 4. వేప 5. జువ్వి
నవగ్రహ వృక్షాలు
: 1. తెల్లజిల్లేడు - సూర్య 2. మోదుగ - చంద్ర 3. రావి - గురు 4. మేడి - శుక్ర 5. ఉత్తరేణి
- బుద్ధ 6. నల్లసంద్ర - మంగళ 7. జమ్మి - శని 8. గరిక గడ్డి - రాహు 9. దర్భ గడ్డి - కేతు
గణపతి పూజా పత్రాలు
: మాచపత్రి, వాకుడు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు,
విష్ణుక్రాంతము, దానిమ్మ, మరువము, దేవదారు, వావిలి, జాజి, జమ్మి, రావి, తెల్లమద్ది,
జిల్లేదు, వెలగ
నక్షత్ర వనం
| నక్షత్రం పేరు | చెట్టు పేరు | నక్షత్రం పేరు | చెట్టు పేరు | నక్షత్రం పేరు | చెట్టు పేరు | నక్షత్రం పేరు | చెట్టు పేరు |
|---|---|---|---|---|---|---|---|
| 1. అశ్విని | అడ్డసరము | 8. పుష్యమి | పిప్పలి | 15. స్వాతి | మద్ది | 22. శ్రావణం | జిల్లేడు |
| 2. భరణి | దేవదారు | 9. ఆశ్లేష | నాగకేసరి | 16. విశాఖ | నాగలింగ | 23. ధనిష్ఠ | జమ్మి |
| 3. కృత్తిక | మేడి | 10. మఖ | మర్రి | 17. అనురాధ | బొగర | 24. శతబిష | అరటి |
| 4. రోహిణి | అల్లనేరేడు | 11. పుబ్బ | మోదుగ | 18. జ్యేష్ఠ | విషముష్టి | 25. పూర్వాభాద్ర | మామిడి |
| 5. మృగశిర | నండ్ర | 12. ఉత్తర | జువ్వి | 19. మూల | వేగిస | 26. ఉత్తరాభాద్ర | వేప |
| 6. ఆరుద్ర | రావి | 13. పూర్వ | కుంకుడు | 20. పూర్వాషాడ | నిమ్మ | 27. రేవతి | ఇప్ప |
| 7. పునర్వసు | వెదురు | 14. చిత్త | ఇరి | 21. ఉత్తరాషాడ | పనస |
ఇంటింటికి కావలసిన మొక్కలు :
పూర్వం మనగ్రామాలలోని ప్రతి ఇల్లు ఒక నందన
వనంలా ఉండేది. ఇంటి ఆవరణలో నాటుకునే మొక్కల వలన
వారికి కావలసిన పోషకాహారాలు అందటమే కాకుండా ఎంతో
ఆహ్లాదకరంగా పూలచెట్లు కనువిందు చేసేవి. పచ్చని చెట్ల
మధ్య ఉన్న ఇంటిలోని వారికి ప్రాణ వాయువు పుష్కలంగా
దొరుకుతుంది. దానితో వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత:
కుటుంబ సభ్యులు
నాటవలసిన మొక్కలు:
1) కొబ్బరి 2) అరటి 3) మామిడి 4) సపోట 5) జామ 6) నిమ్మ 7) కరివేపాకు 8) మునగ 9) బాదం 10) వేప
11) పూల మొక్కలు ( గులాబి, మందార, గన్నేరు, పారిజాతం, నందివర్ధనం, మల్లె) 12) గోరింటాకు 13) ఉసిరి