Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1
  1. 13. ఔపోసన పట్టిన ఉద్గ్రంధాలలోని కూటలను ఉగ్గుపాలవలె
    రంగరించి ఊరడించిన ఉజ్వలమూర్తికి వందనం
  2. 14. అందరిలో ఒకరిలా కనిపించే ఈ మాంసనేత్రాలకు
    జ్ఞాననేత్రాలతో లోచూపు నేర్పించే లోకబాంధవునికి వందనం
  3. 15. 'అః' అనిపించే రూపలావణ్యంతో అందరి మదిలో నిలిచే
    అద్వితీయమూర్తికి హృదయాభివందనం
  4. 16. కన్నవారింటికి వచ్చిన అనుభూతిని పొందేట్లు
    ఆదరించి అభిమానించిన నాన్నగురుదేవులకు వందనం
  5. 17. కాకుల వంటి లోకులకు కమనీయమైన మాటలతో
    కాకులను కోకిలలుగా మార్చిన కారుణ్యమూర్తికి వందనం
  6. 18. కించిత్ భేషజము లేక క్రిందికి దిగజారే శిష్యరేణువులను
    ఆప్యాయంగా ఆదరించి అక్కున చేర్చుకునే ధీరోదాత్తునికి వందనం
  7. 19. క్రీగంటి చూపులతో కన్నీళ్ళను కరిగించి
    కలిమిలేములనే భేదంబులేక కడుపార పలకరించే కరుణామయునికి వందనం
  8. 20. కృపాకటాక్షాలే గవాక్షాలై కడుజాగరూకతతో
    ఆదరించే కడు రమణీయమూర్తికి వందనం
  9. 21. కుందనపు బొమ్మలాంటి మేనిఛాయతో మనో కురూపుల్లాంటి
    మమ్ములను చేరదీసిన ఔన్నత్యమూర్తికి వందనం
  10. 22. కూపస్థ మండూకాలను సాగరతీరపుటంచులకు
    చేర్చిన విశాలహృదయునికి వినయపూర్వక వందనం
  11. 23. కెరటంలోనున్నది నీరేనని కెరటంగా చూడవద్దని
    ఆత్మనుండి నీవు వేరుకాదని నిశితంగా విశదపర్చిన నిత్యానందమూర్తికి వందనం
  12. 24. కేవలం ఉన్నది నీవే ఆత్మగానేనని ఎరుకపర్చి
    ఆత్మకు భిన్నమైన నేనుకు ఉనికి లేదని తేటపర్చిన హృదయేశ్వరునికి వందనం