Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesపిల్లలంతా కలిసివచ్చిన ఒక సందర్భంలో ఆమె తన మనసులో కోరిక బయటపెట్టింది. “మా దగ్గర ఎవరో ఒకరు ఉంటే బావుంటుందిరా. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకు వస్తే ఒకళ్లకొకళ్లం తోడుగా ఉంటాం.”
“అదెలా కుదురుతుందమ్మా? మా ఉద్యోగాలు, పిల్లల చదువులు, వాళ్ల భవిష్యత్తు ఇంకెక్కడో
ఉంటేను”
పెద్దవాడి మాటలకి అందరూ సపోర్టే.
అత్తమామలు లేని కూతురు చెబుతోంది. – “నేను ఎలాగూ మీ లెక్కలోకి రానుకదా.
కొడుకుల దగ్గరేగా ఉండాలనుకుంటారు మీరు” నిష్టూరం గొంతు నిండా. ఆస్తులు కొడుకులతో
పాటు సమానంగా పంచుకున్నాక కూడా కూతురు ఇంతవరకే ఆలోచించింది. ఆయన నిట్టూర్చాడు.
భార్య వైపు దిగులుగా చూసేడు.
ఆమె ఎవర్నీ నొప్పించలేనట్లు, ఏం చెప్పలేనట్లు మౌనంగా ఉండిపోయింది. ఆయన
అసంకల్పితంగా అనుకున్నాడు ఆ క్షణం, తామిద్దరూ కలిసి ఒకే క్షణం ఈ జీవయాత్రని
ముగించలేకపోవటం జరిగితే మాత్రం 'ఈమె నాకంటే ముందుగా వెళ్లిపోవాలి' అని. తానైతే
ఎలాగైనా బ్రతికేస్తాడు. ఆమె... అమాయక.
పిల్లలందరూ తండ్రిగా తన పట్ల భయభక్తులుతోనే ఉంటారు. తన మాట ఇప్పటికీ
శాసనంలాగే అమలు చేస్తుంటారు. కానీ వాళ్ల అసహనాన్ని మాత్రం తల్లి మీద స్పష్టంగా ప్రదర్శిస్తూ
ఉంటారు. ఆయన ఎన్నోసార్లు గమనించేడు. కానీ తనంత ఎదిగిన పిల్లల్ని మందలించలేకపోయేడు.
తల్లి పట్ల వాళ్ల బాధ్యత ఎన్నో సందర్భాల్లో చెబుతూనే ఉన్నాడు. తానున్నంత కాలం ఆమెను వెయ్యి
కళ్లతో కాచుకోగలడు. కానీ తన అనంతరం ఏమిటి?ఈ ప్రశ్న ఆయన్ని కలవరపరుస్తూనే ఉంది.
తను అనారోగ్యం బారిన పడిన సమయంలో ఆమె భవిష్యత్తు ఏమిటి అన్న చింత గుండెలో
మెలిపెడుతూనే ఉంది. ఆమెను ఆఖరి క్షణం వరకూ తను మాత్రమే చూసుకోగలడు, అది
సాధ్యమేనా అన్న ఆలోచన మరో వైపు. వయో ధర్మ రీత్యా తను ఇప్పటికే చాల జీవించేడు, ఆమె
కంటే. ఈ ఆలోచనలు పిరికివాణ్ణి చేస్తూనే ఉన్నాయి ఇన్నాళ్లూ.
ఎనభై ఏళ్ల వయసులోనూ స్వతంత్రంగా జీవించిన ఒంటరి మేనత్త ఆయన కంటి ముందు
ఎన్నోసార్లు ప్రత్యక్షమవుతూనే ఉండేది. తన దారిన తాను వెళ్లిపోతే రేపు ఈమె కూడా అంతే కదూ.
మిగిలిపోయిన పావురం
అనురాధ నాదెళ్ళ
patrika.kinige.com