Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesజ్వాలాముఖి..మంత్రాలదీవి...
శ్రీసుధామయి
జ్వాలాముఖి.. మంత్రాల దీవి
శ్రీసుధామయి
అది కపిలారణ్యం అని పిలువబడే దుర్గమమైన దట్టమైన అరణ్యం. ఎటు చూసినా ఆకసాన్ని తాకే మహావృక్షాలు. వాటి నడుమ అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు తీగలతో నిండి ఉంది. అక్కడికి సుమారు అరక్రోసు దూరంలో బల్లపరుపుగా ఉన్న ఎత్తయిన ప్రదేశం. ఆ ప్రదేశం పై భాగంలో కొండశిఖరంలా అగుపించే నిటారైన ప్రాంతం ఎంతో కాలంగా ఆకులు కప్పబడినట్టు ఉంది చుట్టూ అనేక లతలు తీగలు దట్టంగా అల్లుకుని ఉన్నాయి.
ఒక్కసారిగా ప్రకృతి కన్నెర్ర చేసినట్టు భూమి కంపించడం మొదలైంది. అరణ్యంలోని జంతువులు భీతిగా పరుగులు తీశాయి. పక్షులు ఆ ప్రదేశం నుంచి భయంతో ఆకాశంలోకి ఎగిరాయి.
జ్వాలాముఖి.. మంత్రాలదీవి
5
శ్రీసుధామయి