Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ఇంకా రెండు రోజులుండవూ...

“బుజ్జీ అత్తయ్య నీ దగ్గరకు వస్తుందంట. మొన్న నాగమాణిక్యం గారింట్లో పెళ్లిలో కనబడి
చెప్పింది” ఫోన్ లో అమ్మగొంతు.

“ఎందుకూ!”

“ఏమో! నాకు తెలియదు. ఎందుకని అడిగితే ఊరికే లేవే అంది.”

“నేనీ ఊరు వచ్చి ఎనిమిదేళ్లయినా రానిది ఇప్పుడెందుకొస్తుందో!”

నిజానికి నాకు అత్తయ్య వస్తుందంటే ఆనందం! ఎప్పుడూ రానిది ఎందుకొస్తోంది?

అత్తయ్యని చూసి దాదాపు అయిదేళ్లవుతోంది. అది కూడ ఏదో పెళ్లిలో కొద్దిసేపు
కలిసానంతే! భౌతికంగానూ, మానసికంగానూ పెరిగిన దూరం అత్తయ్యతో సాన్నిహిత్యాన్ని
మాయం చేసింది. అప్పుడప్పుడూ మెరిసే బాల్యస్మృతుల మధ్య అందమైన అత్తయ్య ఓ తీపి జ్ఞాపకం.

‘దూరమైన కొలదీ పెరుగును అనురాగం’ అనేది అబద్దం. అది విరహానికే పరిమితం.
తరచూ కలుసుకోకుంటే మనుష్యుల మధ్య దూరం పెరగడమే గాని తరగడం ఉండకపోవచ్చు.

చిన్నప్పుడు సెలవులన్నీ అత్తయ్య వాళ్ల ఊరిలోనే! ఊరి చుట్టూ కొండలే. రాంబాబు బావ
కొండ దాటించి వాళ్ల తోటకి తీసుకెళ్లడం ఇంకా గుర్తే. తోట నిండా మామిడి చెట్లు, పనస చెట్లు,
కుంకుడు, మునగా...

ఎలా మర్చిపోను?.

నిజానికి నేనుండే ఊరికీ మా అత్తయ్య వాళ్ల ఊరికీ పెద్ద దూరం లేదు. ఒక రాత్రి ప్రయాణం
ఇప్పుడేమంత దూరం.

కాని నాకే వెళ్లడం కుదరటం లేదు. కుదర లేదో వెళ్లాలనుకోలేదో నాకే తెలియదు.
అభిమానం హృదయాంతరంలో అలానే ఉంది. అభిమానాన్ని ప్రదర్శించడానికి కూడా కొంత
ప్రయత్నం అవసరమేమో!

నాచిన్నప్పుడు అత్తయ్యా వాళ్ళది చాలా పెద్దకమతం. పాతికెకరాల మాగాణి, జీడి మామిడి
తోటలూ! అన్నీ మావయ్య చేతకానితనానికీ, వ్యసనాలకీ, పిల్లల పెళ్లిళ్లకీ ఖర్చయిపోయాయి.

ఇంకా రెండు రోజులుండవూ...

నరుకుర్తి శ్రీధర్

patrika.kinige.com