Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

1.9 పునరుద్ధరణ మరియు పునరావాసం:

ఖనిజ త్రవ్వకం జరిగిన తరువాత భూమి పునరుద్ధరణను సమర్ధవంతంగా జరిపి వాటిలో హరితవనములు పెంపొందించడం ఉపయోగించడము జరుగుతుంది.

1.10 ప్రాజెక్టు వ్యయ అంచనాలు:

గని నిర్వహణకు మూలధన వ్యయం 180 లక్షల రూపాయలు మరియు పర్యావరణ అభివృద్ధి నిర్వహణకు 51.35 లక్షలు రూపాయలు.

1.11 పర్యావరణ నిర్వహణ ప్రణాళిక:

మైనింగ్ కార్యకలపాలను ఉద్దేసించి నిరంతర పర్యావరణ అభివృద్ధికి మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఉత్తమ పర్యావరణ పద్ధతులను అనుసరించడానికి పర్యావరణ నిర్వహణ ప్రణళికను నిబద్ధతతో పాటించడానికి వివరించడం జరిగినది. ప్రతిపాదిత ఖనిజ లీజు ప్రాంతంలో స్థిరమైన పర్యావరణ అభివృద్ధికి నిర్వహణ ప్రణాళిక ఉపయోగపడుతుంది.

1.11.1 వాయు పర్యావరణం:

వాయు నాణ్యతను నిర్వహించడానికి ఉపశమన చర్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • ఖనిజ నిర్వహణ ద్వారా వచ్చే దుమ్ము మరియు ధూళి కణాలను అరికట్టుటకు సున్నితమైన ప్రాంతాల్లో నీటిని చిలకరించడం మరియు లీజు సరిహద్దుల్లో హరితవనము పెంచడం ప్రతిపాదించబడినది. టిప్పర్లలో అధికలోడును నియంత్రించి మరియు రోడ్డుపై ఎటువంటి ఖనిజ పరమాణువులు పడకుండా చేయవచ్చు. ఖనిజమును తరలించుసమయములో టిప్పర్లపై టార్పాలిన్ కప్పబడును.
  • ప్రతిపాదిత ఖనిజ ప్రాంతం సరిహద్దు చుట్టూ హరితవనము అభివృద్ధి చేయడం.
  • గాలి నాణ్యత యొక్క కాలానుగుణ పరిశీలన మరియు కాలుష్య నియంత్రించడానికి చర్యలు

1.11.2 శబ్ద పర్యావరణం:

ఖనిజ త్రవ్వకానికి ఉపయోగించే భారీవాహనాలు, హాలేజ్ మరియు స్క్రీనింగ్ ప్లాంట్ వలన శబ్దం ఉత్పత్తి అవుతుంది. అయితే చుట్టూప్రక్కల ప్రాంతాలపై శబ్దం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. రవాణా వాహనములు పరిమిత వేగంలో ప్రయాణించడం వలన దుమ్ము, ధూళి మరియు శబ్దం విడుదల తగ్గును. ఖనిజ స్క్రీనింగ్ జరిగేటప్పుడు శబ్దాన్ని తగ్గించడానికి పరికరాలు ఉపయోగించబడును. గని సరిహద్దులు మరియు రోడ్లకిరువైపుల హరితవనం పెంచడం వలన శబ్ద తీవ్రతను తగ్గించవచ్చును.