Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

అనుబంధం - 6

మార్గదర్శనం నోట్ - ఇన్వెస్టర్లకు ఎక్స్ఛేంజ్(ల)లో ట్రేడింగ్ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి

మీరు ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు
1. మీరు SEBI రిజిస్టర్డు మధ్యవర్తులతో మరియు వారి ద్వారా మాత్రమే లావాదేవీలు జరపండి. స్టాక్ ఎక్స్ఛేంజిల వెబ్ సైట్ www.exchange.com మరియు SEBI వెబ్ సైట్ www.sebi.gov.in లో లభించే జాబితా నుండి మీరు SEBI రిజిస్టర్డు సర్టిఫికెట్ నంబరు చెక్ చేయవచ్చు.
2. మీరు KYC ఫారంని తప్పకుండా నింపాలి మరియు KYC ఫారంలోని ఖాళీ విభాగాలను కొట్టేయాలి.
3. మీరు తప్పనిసరి డాక్యుమెంట్లు అన్నిటినీ అంటే స్టాక్ బ్రోకర్ హక్కులు మరియు బాధ్యతలు, రిస్కు వెల్లడింపు పత్రం, పాలసీ మరియు ప్రక్రియ డాక్యుమెంటు, తప్పకుండా చదవాలి.
4. మీరు మరియు స్టాక్ బ్రోకర్ అంగీకరించిన ఏవైనా స్వఛ్ఛంద క్లాజులను మీరు తప్పకుండా చదవాలి, అర్ధంచేసుకోవాలి మరియు సంతకం చేయాలి. మీరు మరియు స్టాక్ బ్రోకర్ అంగీకరించిన క్లాజులను మీ సమ్మతి లేకుండా మార్చడం కుదరదు.
5. ట్రేడింగ్ కి మీకు బ్రోకర్ విధించిన కవరేజి, కమిషన్లు, ఫీజు మరియు ఇతర ఛార్జీలు మరియు SEBI/స్టాక్ ఎక్స్ఛేంజ్ లు నిర్దేశించిన సంబంధిత ప్రొవిజన్లను /మార్గదర్శకాల గురించి స్పష్టమైన ఐడియా పొందండి.
6. మీరు అమలుపరిచిన డాక్యుమెంట్ల కాపీని స్టాక్ బ్రోకర్ నుంచి ఉచితంగా పొందండి.
7. ఒకవేళ మీరు స్టాక్ బ్రోకర్ పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ (POA) ఇవ్వాలనుకుంటే, మీ బ్యాంకు మరియు డీమ్యాట్ అకౌంట్ ని నిర్వహించేందుకు అనుమతి ఇవ్వండి, ఈ విషయంలో దయచేసి SEBI / ఎక్స్ఛేంజ్ లు జారీచేసిన మార్గదర్శకాలు చదవండి.
లావాదేవీలు మరియు పరిష్కారాలు
8. మీరు రాతపూర్వకంగా ప్రత్యేకంగా అధీకృతం ఇస్తే ఎలక్ట్రానిక్ కాంట్రాక్టు నోట్స్ (ECN)లను స్టాక్ బ్రోకర్ జారీచేస్తారు. ఇందుకోసం మీరు స్టాక్ బ్రోకర్ కి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ECNని ఎంచుకోకండి.
9. మీ ఇంటర్నెట్ ట్రేడింగ్ అకౌంట్ పాస్వర్డ్ ని ఎవ్వరికీ ఇవ్వకండి.
10. స్టాక్ బ్రోకర్ కి నగదు రూపంలో డబ్బు ఏమీ చెల్లించకండి.
11. డబ్బు చెల్లింపులను స్టాక్ బ్రోకర్ పేరుతో అకౌంట్ పేయీ చెక్కు రూపంలో చేయండి. మీరు స్టాక్ బ్రోకర్ కి డబ్బు చెల్లించినట్లుగా/సెక్యూరిటీలను డిపాజిట్ చేసినట్లుగా తప్పకుండా డాక్యుమెంటరీ రుజువులు ఉంచుకోండి. తేది, స్క్రిప్, పరిమాణం, ఇలా చెల్లించిన డబ్బు లేదా డిపాజిట్ చేసిన సెక్యూరిటీలు ఏ బ్యాంకు పేరుతో మరియు ఏ బ్యాంకు/డిమ్యాట్ అకౌంట్ నుండో తెలియజేయాలి.
12. స్టాక్ ఎక్స్ఛేంజిల వెబ్సైట్ ల్లో ట్రేడింగ్ ని వెరిఫై చేసుకునే సదుపాయం లభిస్తుందని గమనించండి, కాంట్రాక్టు నోట్ లో తెలియజేసిన విధంగా ట్రేడింగ్ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్టు నోట్ లో తెలియజేసిన వివరాలతో వెబ్సైట్లోని ట్రేడ్ వివరాలు సరిపోలకపోతే, సంబంధిత స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇన్వెస్టర్స్ గ్రీవెన్స్ సెల్ ని సంప్రదించవచ్చు.
13. రన్నింగ్ అకౌంట్ నిర్వహణ కోసం మీరు నిర్ధిష్టమైన అధీకృతం ఇస్తే, ఫండ్స్ చెల్లింపు లేదా సెక్యూరిటీల డెలివరి (ఏదయితే అది), ఎక్స్ఛేంజ్ నుంచి పేఅవుట్ అందినప్పటి నుంచి ఒక పని దినం లోపల మీకు చేయబడవు. కాబట్టి, ఈ కింది షరతులకు లోబడి రన్నింగ్ అకౌంట్ ని స్టాక్ బ్రోకర్ నిర్వహించాలి:
a) మీరు ఇచ్చిన అధీకృతంలో తేదీ వేయాలి, మీరు మాత్రమే సంతకం చేయాలి మరియు ఏ సమయంలోనైనా మీరు ఎత్తేసుకునే క్లాజు ఉండాలి.
b) ఫండ్స్ లేదా సెక్యూరిటీల వాస్తవ పరిష్కారాన్ని స్టాక్ బ్రోకర్, మీ ప్రాధాన్యతను బట్టి క్యాలెండర్ త్రైమాసికంలో లేదా నెలలో కనీసం ఒకసారి చేయాలి. అకౌంట్ ని పరిష్కరించేటప్పుడు, ఫండ్స్ కోసం క్లయింట్ లెడ్జర్ నుంచి ఎక్స్ ట్రాక్ట్ ఉన్న 'అకౌంట్ల స్టేట్మెంట్' మరియు ఫండ్స్, సెక్యూరిటిల రిసెప్ట్ లు/డెలివరిలు అన్నిటినీ వెల్లడించే సెక్యూరిటీల రిజిస్టరు నుంచి ఎక్స్ ట్రాక్ట్ ని స్టాక్ బ్రోకర్ మీకు పంపుతారు. ఫండ్స్ మరియు సెక్యూరిటీల రిటెన్షన్ ని మరియు తనఖా పెట్టిన ఏవైనా షేర్ల వివరాలను