Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesభగవాన్: దైవానుగ్రహం, దైవ సంకల్పం దేన్నైనా మార్చివేయ కలుగుతుంది. భగవంతుడనగా ప్రేమ. భగవంతుని అపారమైన కరుణతో నీ ప్రారబ్ద కర్మ కానీ నీ పూర్వ జన్మముల కర్మ ఫలములు కానీ మార్చివేయగలడు. భక్తుడు తన హృదయమనే జైలులో దేవుని బంధించి వేయగలడు.
ఈ లోకంలో భక్తితో సాధించలేనిది ఏదియు లేదు. దైవానుగ్రహంతో నీ పూర్వ జన్మ కర్మ ఫలములు, కర్మ ప్రభావములు చెరిపి వేయవచ్చు. ప్రతికూలమైన దురదృష్టములు ఏవి జరగవు.
ఒక చిన్న ఉదాహరణ: మందుల షాపులో అనేక రకమైన మందులు అమ్మకానికి పెట్టి ఉంటాయి. ప్రతి మందు సీసా పైన ఆ మందు తయారు చేసిన తేదీ, ఎక్సపైరీ తేదీ వ్రాసి ఉంటాయి. ఎక్సపైరీ తేదీ తర్వాత వాడితే ఆ మందు పని చేసే శక్తి తగ్గిపోతుంది. పనికి రాకుండా పోతుంది.
భగవంతుడు కూడా అదే చేస్తాడు. మందు సీసా మీద ఎక్సపైరీ తేదీ ముద్ర కొట్టినట్లు నీ ప్రారబ్ద కర్మ రద్దు అయిపోయేటట్లు చేస్తాడు. అంతటితో నీ బాధ, కష్టములు అంతమైపోతాయి. ఈ విధముగా స్వామి, తన అపారమైన దయ, కరుణతో నీ బాధలు తీరుస్తాడు.
స్వామి, ప్రతి రోజూ సాధన చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక దొరుకుతుందా?
భగవాన్: తప్పకుండా! తప్పకుండా దొరుకుతుంది! సందేహం ఎందుకు? ఉదాహరణకి, నీకొక పెంపుడు కుక్క ఉందనుకో. దానికి రోజూ తిండి పెడితే, రోజూ అదే సమయానికి నీ దగ్గరకు వస్తుంది. ఆ విధంగా క్రమము తప్పకుండా చేసినదానికి నీ కుక్కే క్రమమును అనుసరిస్తే మరి భగవంతుడు ఎందుకు చెయ్యడు? తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది.
స్వామి, మీ అపారమైన కరుణ, అనుగ్రహం వల్ల మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. మీ దర్శన, స్పర్శన, సంభాషణ అనే సూర్యకిరణాలలో ఆనందిస్తున్నాము. అయినా కూడా పూర్వ జన్మ సుకృతము అవసరమా?
భగవాన్: ఈ నాటి ఆనందము, పూర్వ జన్మ సుకృతము, రెండూ అవసరమే. రెండిటికీ సంబంధ బాంధవ్యములు ఉంటుంటాయి. ఉదాహరణకి, ఇక్కడ మట్టి ఇసుక మట్టి. వర్షము ఎక్కువగా పడినప్పుడు నీరంతా ఇసుకలోకి ఇంకిపోతాయి. మీలో కూడా ఆ విధముగనే భక్తి స్థిరంగా ఉండదు.
కానీ నదిలో వర్షం పడితే నీరు ఎలా ప్రవహిస్తుంది? అంతకు ముందు కంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. అదే విధముగా మీరు ఈ ప్రస్తుత్త సమయములో ఇక్కడ నాతో ఉండగలగడము ఆ వర్షము నీరు వంటిది. అందువలననే ఈ అదృష్టము, భాగ్యమును జాగ్రత్తగా కాపాడుకోమని మీతో ఎప్పుడూ చెపుతూ ఉంటాను. ఒక బావిలోనుంచి నీరు తోడాలంటే ఒక బకెట్టుతో లాగి, ఆ నిండు బకెట్టును నువ్వే మొయ్యాలి.
2