Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesఉఫ్. గుండెల్నిండా ఊపిరి తీసుకున్నా. గాలిలో తేలిపోతున్నంత హాయిగా వుంది.
ఆ మరు క్షణమే అతను – ఆటోమాటిక్ గా ఆనందాల పుట్టైపోయాడు.
“ఒహ్హ! వాటే వాటే సర్పైజ్... శుభానల్లా.. శుభానల్లా...” అంటూ, చేతిలో పైప్ ని
కిందకిసిరి, ఒక్క ఉదుటున నా కతి సమీపంగా వచ్చేసాడు. వచ్చి, చేతులు చాచబోయి.. ఏదో
గుర్తుకొచ్చిన వాడిలా హఠాత్తుగా ఆగిపోయాడు. పొరబడిన వానిలా, తడబడతూ.. తమాషాగా
భుజాలను ష్రగ్ చేసాడు.
చప్పున నా చూపుల్ని నేల మీదకి తప్పించా, ఒక సెకను పాటు. అతని అవస్థని నేనేమీ,
చూడలేదని అతననుకోవడం కోసం.
అమీర్- రెండు అరచేతుల్ని దగ్గర చేసుకుని, పెదాలకాన్చుకున్నాడు. నా వైపు సంబరంగా
చూస్తూ....!
అమీర్ కి – నా రాక నిజం గానే పట్టలేని ఆశ్చర్యాన్ని, పండగనీ ఇస్తోందని ఇట్టే
పసిగట్టేసాను.
అది చూసి లోలోనే చలించిపోయాను.
‘నేనునేను గా లేను' అని అందుకే కామోసు ఇన్ని పాటలొచ్చాయి!
“నువ్వంటె, నేనింకా నమ్మలేకపోతున్నా సుమా!” అంటూ, చేయందించాడు. సున్నితం గా
తాకి వదిలేసాను.
“కమాన్ కమాన్..లోపలికి రా..” అంటూ గబగబా ఇంట్లోకి దారి తీసాడు. మౌనంగా
అతని వెనకే అడుగులేసాను.
వసారాలోంచి, డ్రాయింగ్ రూం.. దాటాక, లోపల హాల్ లోకి తీసుకొచ్చాడు. ఎంత నీట్ గా
వుంది! సొగసుగా, విదేశీ ఫర్నిచర్ తో ఇన్నోవేటివ్ గా వుంది.
అది హాల్ కం – ఓపెన్ కిచెన్ కం – డైనింగ్………
ఓ పక్క నించి పైకెళ్లడం కోసం వొంపయిన వుడెన్ మెట్లున్నాయి. పైన గదులున్నట్టున్నాయి.
బహుశా బెడ్రూంలు అయి వుండొచ్చు.
ఊరికే వీచే గాలులు
ఆర్. దమయంతి
patrika.kinige.com